Thegimpu Collections: మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసిన అజిత్ తెగింపు!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. అజిత్ నటించే సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ‘తెగింపు’ (తమిళంలో తునివు) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజిత్. జనవరి 11న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. జిబ్రాన్ సంగీత దర్శకుడు కాగా…నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.

రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంస్థలు కలిసి ‘తెగింపు’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

నైజాం 0.06 cr
సీడెడ్ 0.13 cr
ఆంధ్ర 0.65 cr
ఏపీ + తెలంగాణ 1.38 cr

‘తెగింపు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి రోజే ఈ చిత్రం రూ.1.38 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ ఇంకా రూ.1.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పండుగ సెలవులు ముగిసే వరకు ఈ మూవీ డీసెంట్ గా పెర్ఫార్మ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus