‘నెట్’ మూవీ : ఆ ముగ్గురి నటన పై ప్రశంసల వర్షం..!

నిన్న జీ5 ఓటిటిలో రిలీజ్ అయిన ‘నెట్’ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఓ పక్క ‘టక్ జగదీష్’ వంటి పెద్ద చిత్రం కూడా ఓటిటిలో అందుబాటులో ఉన్నప్పటికీ ‘నెట్’ మూవీ చూడడానికే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడం విశేషం.దానికి ప్రధాన కారణం ముందు నుండీ ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు అద్భుతమైన స్పందన లభించడం అనే చెప్పాలి. ఈరోజుల్లో విపరీతమైన ప్రెజర్ వల్ల.. వాటిని అధిగమించడానికి అస్లీల చిత్రాలు చూడడానికి ఎడిక్ట్ అయ్యి… యువత చేసే పొరపాట్లని అలాగే వాళ్ళు పోగొట్టుకుంటున్న అమూల్యమైన సమయాన్ని అలాగే బంధాలను…

ఈ గంటన్నర నిడివి గల ‘నెట్’ మూవీలో చాలా క్లుప్తంగా చూపించాడు దర్శకుడు భార్గవ్ మాచర్ల. అయితే అతను అనుకున్న కాన్సెప్ట్ కు అలాగే అతను రాసుకున్న పాత్రలకు న్యాయం చేసే పాత్రధారులను ఎంపిక చేసుకోవడం సులభం ఏమీ కాదు.అయినప్పటికీ ఈ విషయంలో అతను ఏమాత్రం తడబడలేదు. శృంగారం పట్ల విపరీతమైన వ్యామోహం కలిగిన లక్ష్మణ్ పాత్రలో రాహుల్ రామకృష్ణని, భర్త ప్రేమని… అనురాగాన్ని మిస్ చేసుకుంటున్న ఇల్లాలు సుచిత్ర పాత్రలో ప్రణీత పట్నాయక్ ని, బాయ్ ఫ్రెండ్ ద్వారా మోసపోయిన అమ్మాయి ప్రియా పాత్రకి అవికా గోర్ ను ఎంపిక చేసుకోవడంలో అతని నైపుణ్యం ఏంటన్నది మనం అర్ధం చేసుకోవచ్చు.

అలాగే వాళ్ళు కూడా ఆ పాత్రల స్వభావాలని అర్ధం చేసుకుని వాటికి జీవం పోశారనే చెప్పాలి. ఇప్పటి వరకు కామెడీతోనే మెప్పిస్తూ వచ్చిన రాహుల్ రామకృష్ణని కంప్లీట్ యాక్టర్ గా మలిచిన చిత్రమిది. అలాగే పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసే అవికా లో మరో కోణాన్ని మనం చూడొచ్చు.ఇక ప్రణీత పట్నాయక్ ఈ మూవీలో అద్భుతంగా నటించి మరింత పాపులర్ అయ్యిందని చెప్పాలి. ఈ ముగ్గురిని ఈ ‘నెట్’ మరో మెట్టు పైకి ఎక్కించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇక ‘జీ5’ వారితో కలిసి ‘తమడా మీడియా ప్రొడక్షన్స్’ సంస్థ పై రాహుల్ తమడ, సాయి దీప్ బొర్రా ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.