2001 వ సంవత్సరంలో వెంకటేష్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘దేవీపుత్రుడు’.యం.యస్.రాజు నిర్మాణంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. అటు తర్వాత అదే ఏడాది సమ్మర్లో ‘ప్రేమతో రా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకటేష్ సినిమాల టైటిల్స్ లో ‘రా..’ తో ఎండ్ అయిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.కానీ ఆ ఏడాది ‘రా’..సెంటిమెంట్ కూడా కలిసి రాలేదు..!
ఈ క్రమంలో సెప్టెంబర్ 6న (Nuvvu Naaku Nachav) ‘నువ్వు నాకు నచ్చావ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.దీంతో ఆ ఏడాది టాప్ 5 ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగార్జున- మోహన్ బాబు కలిసి చేసిన ‘అధిపతి’, తరుణ్ నటించిన ‘చిరుజల్లు’, రవితేజ ‘చిరంజీవులు’ , జగపతి బాబు ‘నాలో ఉన్న ప్రేమ’ వంటి సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి.
రవితేజ నటించిన మరో సినిమా ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ మాత్రం డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఈరోజుతో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తికావస్తోంది.ఇప్పటికీ ఈ సినిమాని బుల్లితెరపై చూసి ఎంజాయ్ చేసే బ్యాచ్ చాలా మందే ఉన్నారు. రీ రిలీజ్ కనుక చేస్తే భారీగా కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.