సినిమా ఇండస్ట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకోవడం తేలికైన విషయం కాదు. అయితే ఇద్దరు స్టార్ హీరోలు, ఒక స్టార్ హీరోయిన్, ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఆరో హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. కొన్నేళ్ల క్రితం కథల ఎంపికలో తప్పుల వల్ల ఎన్టీఆర్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
అయితే తర్వాత రోజుల్లో కొత్తదనం ఉన్న కథల్లో నటించి తారక్ ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. టెంపర్, నాన్నకుప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. 2015 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు ఎన్టీఆర్ వరుసగా సక్సెస్ లను అందుకున్నారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటించగా ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తారక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మరో స్టార్ హీరో వెంకటేష్ గురు సినిమా నుంచి దృశ్యం2 సినిమా వరకు విజయాలను సొంతం చేసుకున్నారు. గురు, ఎఫ్2, వెంకీ మామ, నారప్ప, దృశ్యం2 సినిమాలు హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలలో నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ ఎఫ్3 సినిమాలో నటిస్తుండగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఇప్పటివరకు ఐదు సినిమాలు తెరకెక్కగా ఈ ఐదు సినిమాలు సక్సెస్ సాధించాయి.
ఎఫ్3 సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాల్సి ఉంది. మరోవైపు బుట్టబొమ్మ పూజా హెగ్డే అరవింద సమేత సినిమా నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరకు వరుసగా విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ బ్యూటీ రాధేశ్యామ్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.