సాధారణంగా ప్రతి సినీ హీరో కెరీర్ లో ఫ్లాపులు ఉంటాయి. జయాపజయాలకు ఏ స్టార్ హీరో కూడా అతీతం కాదు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ లో కూడా ఎన్నో ఫ్లాపులు ఉన్నా తారక్ కెరీర్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీరని నష్టం చేసిన సినిమాలు మాత్రం రెండు ఉన్నాయి. సాధారణంగా తారక్ కెరీర్ లో డిజాస్టర్ అంటే చాలామంది ఆంధ్రావాలా (Andhrawala) సినిమా పేరు చెబుతారు. అయితే కలెక్షన్ల లెక్కల ప్రకారం ఈ సినిమా హిట్ అని స్వయంగా ఈ సినిమా నిర్మాతలే వెల్లడించారు.
అయితే తారక్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన సినిమాలు ఏవనే ప్రశ్నకు నరసింహుడు (Narasimhudu), శక్తి (Sakthi) సినిమాల పేర్లు సమాధానంగా వినిపిస్తుంది. నరసింహుడు సినిమా రిలీజ్ కు ముందు పలు వివాదాలలో చిక్కుకోవడం వల్ల తారక్ కోటి రూపాయలు చెల్లించి కొన్ని అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టి సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఆ సమయంలో ఈ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగా ఈ సినిమా ఫ్లాప్ అయింది.
వాస్తవానికి ఈ సినిమా మరీ బ్యాడ్ సినిమా కాదు. ఈ సినిమా రీమేక్ మూవీ కాగా ఎన్టీఆర్ రేంజ్ కు తగిన కథ, కథనం లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. బి.గోపాల్ (B. Gopal) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆయన స్థాయి సినిమా కాదనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టాలను మిగిల్చిన సినిమాగా శక్తి సినిమాకు పేరుంది. మెహర్ రమేష్ (Meher Ramesh) డైరెక్షన్ లో తారక్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాకు మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ వచ్చింది.
అదుర్స్ (Adhurs), బృందావనం (Brindavanam) హిట్ల తర్వాత తారక్ శక్తి సినిమాతో నిరాశపరిచారు. ఈ సినిమాలో తారక్ తండ్రి పాత్రలో కనిపించిన లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా బడ్జెట్ లో సగం కలెక్షన్లను సైతం ఈ మూవీ సాధించలేదు. శక్తిపీఠాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా తారక్ కెరీర్ లో బ్యాడ్ ఫిల్మ్ గా మిగిలిపోయింది. ఈ రెండు సినిమాలలో తారక్ నటించకుండా ఉండి ఉంటే ఆయన కెరీర్ మరింత బెటర్ గా మరో స్థాయిలో ఉండేదని చెప్పవచ్చు.