మహేష్‌బాబు ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం..!

ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబు ఇంట్లో మంగళవారం రాత్రి చిన్నపాటి ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. మహేష్‌బాబు ఇంట్లో లేని సమయంలో రాత్రి 11.30 ప్రాంతంలో ఆయన ఇంట్లోకి ఓ అగంతుకుడు ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన మహేష్‌ ఇంటి రక్షణ సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో ఈ విషయంలో వైరల్‌గా మారింది. అసలు ఎవరా వ్యక్తి, ఎందుకు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు అనే విషయాలను పోలీసులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మహేష్‌ బాబు నివాస ప్రాంగణంలోకి మంగళవారం రాత్రి ఓ అగంతుకుడు దూకాడు.

ఆయన దూకిన గోడ బాగా ఎత్తుగా ఉండటంతో ఆ అంగతకుడు తీవ్ర గాయాల పాలయ్యాడట. కాపలాదారులు అతన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ అగంతుకుడిని అదుపులోకి తీసుకున్నారు. మహేష్‌బాబు జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.81లో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివాస ప్రాంగణంలో ప్రహరీ గోడ పక్కన పెద్ద శబ్దం వచ్చిందట. కాపలాదారులు వెళ్లి చూస్తే..

ఓ వ్యక్తి గాయాలపాలై పడి ఉన్నాడట. ఏమైంది, ఎవరు అతన్ని విచారిస్తే.. మూడు రోజుల కిందట ఒడిశా నుండి హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పాడట. మహేష్‌ ఇంటికి సమీపంలో ఉన్న నర్సరీ దగ్గర ఉంటున్నా అని చెప్పాడు ఆ కుర్రాడు. మహేష్‌బాబు ఇంట్లో చోరీకి అని వచ్చి 30 అడుగుల గోడ పైనుంచి దూకడంతో గాయాలపాలయ్యాడని పోలీసులు చెప్పారు.

ఇక ఆ అగంతుకుడిని కృష్ణ (30) గా పోలీసులు గుర్తించారు. గాయాలపాలవ్వడంతో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో మహేష్‌బాబు నివాసంలో లేరు. కాపలాదారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus