‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా గత వారం రిలీజ్ అయ్యింది. సక్సెస్ఫుల్ గా వెయ్యి కోట్లు మార్క్ దాటేసింది. వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతుంది ‘పుష్ప 2’. ముఖ్యంగా నార్త్ , ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఈ ‘పుష్ప 2’ భారీ వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ ఊపు చూస్తుంటే.. డిసెంబర్ నెల అంతా క్యాష్ చేసుకునేలా కనిపిస్తుంది. ఈ సినిమా దెబ్బకు చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మొదటి రోజు ‘పుష్ప 2’ కి కొంత మిక్స్డ్ టాక్ కూడా వినిపించింది.
Pushpa 2
ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండాఫ్ లో హై మూమెంట్స్ ఉన్నప్పటికీ, చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి అని, సినిమాలో స్టోరీ లేకుండా ఎలివేషన్స్ తో నడిపించేశాడు దర్శకుడు సుకుమార్ (Sukumar) అని.. కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇటీవల కాలంలో హైప్ ఉన్న సినిమాలకి ఇలాంటి మిక్స్డ్ టాక్ లు ఎటువంటి ప్రభావం చూపవు. ఈ విషయాన్ని కూడా ‘పుష్ప 2’ ప్రూవ్ చేసింది. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ లో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. కానీ అన్ని పాత్రలకి ఎక్కువ డైలాగ్స్, స్క్రీన్ స్పేస్ వంటివి దొరకలేదు.
ఎక్కువ శాతం అల్లు అర్జున్ (Allu Arjun) పాత్రే కనిపించింది. అదే హైలెట్ అయ్యింది. శ్రీతేజ్ (Sri Tej) వంటి నటీనటులకు డైలాగులు కూడా లేవు. జస్ట్ చివరికి హీరోని హగ్ చేసుకోవడానికి.. కాసేపు ఆనంద భాష్పాలు కార్చడానికి మాత్రమే ఆ పాత్ర అన్నట్టు ఉంది. ‘పుష్ప’ (Pushpa) మొదటి భాగంలో హైలెట్ అయిన కేశవ పాత్ర కూడా ‘పుష్ప 2’ పెద్దగా పేలింది లేదు. అయితే పార్ట్ 2 లో లేని ఓ పాత్రకి మంచి హై ఇచ్చారు. ఈ సినిమాలో ఆ నటుడు లేకపోయినా.. బాగా ఎలివేట్ చేశారు అని చెప్పాలి.
అతను మరెవరో కాదు గోవిందప్ప పాత్ర చేసిన శత్రు. మొదటి భాగంలో ఇతను ఓ పోలీస్ గా కనిపిస్తాడు. చాలా సిన్సియర్ గా డ్యూటీ చేసే ఇతనికి పుష్పరాజ్ ని ఆధారాలతో అరెస్ట్ చేయాలనే లక్ష్యం ఉంటుంది. కానీ అతన్ని పట్టుకోలేకపోవడంతో ట్రాన్సర్ చేయించుకుని వేరే ఊరికి వెళ్ళిపోతాడు. ‘పుష్ప 2’ లో అల్లు అర్జున్ పాత్ర ‘గోవిందప్ప చాలా నిజాయితీ కలిగిన ఆఫీసర్, అతను చాలా గొప్పోడు, అతనికి కదా కొట్టాలి సెల్యూట్’ అన్నట్టు చెబుతాడు. ఇలా సెకండ్ పార్ట్..లో లేకపోయినా శత్రు హైలెట్ అయ్యాడు అని చెప్పాలి.