Samantha: సమంతకు అసలు సిసలు ఛాలెంజ్ ఇది..!

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కరోనా టైం నుండి డిమాండ్ తగ్గింది. కరోనా తర్వాత థియేటర్ కు వచ్చే ఆడియన్స్ పర్సెంటేజ్ కూడా తగ్గింది. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన జనం థియేటర్ కు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అలాగే లాక్ డౌన్ టైంలో విపరీతంగా మంచి రేట్లు పెట్టి సినిమాలు కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థలు.. లాక్ డౌన్ ముగిశాక పద్ధతి మార్చాయి. పెద్ద హీరోయిన్ ఉన్నా.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ రేట్లు పెట్టడం లేదు.

దీంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బిజినెస్ లు కూడా భారీగా జరగడం లేదు. ఇప్పుడు సమంత నటించిన ‘శాకుంతలం’ పరిస్థితి అలాగే అయ్యింది. నిజానికి ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. అందుకు కారణం.. ఈ చిత్రం వి.ఎఫ్.ఎక్స్ విషయంలో నిర్మాత దిల్ రాజు సంతృప్తి చెందకపోవడంతో.. వేరే టీంని మార్చి చేయించుకుంటున్నారు. అందువల్ల రిలీజ్ వాయిదా పడింది ఈ చిత్రం. దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సమంత కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రానికి బిజినెస్ జరగడం లేదు. పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ‘యశోద’ కలెక్షన్లు చూసి పెద్ద ఆఫర్లు అయితే రావడం లేదు. ‘యశోద’ చిత్రానికి చాలా తక్కువ థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. అందువల్ల ఆ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం, దాని తర్వాత ఓటీటీ రైట్స్ మంచి రేటుకు వెళ్లి రూ.40 కోట్లు బడ్జెట్ పెట్టిన నిర్మాత సేఫ్ అవ్వడం జరిగింది. కానీ ఈసారి అలా లేదు పరిస్థితి.

సమంత పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయినా… అది ఓటీటీ వరకే..! సమంతని చూసి జనాలు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ‘శాకుంతలం’ మూవీ థియేట్రికల్ రైట్స్ పరంగా రూ.30 కోట్లు రాబట్టాలట. అది కూడా తెలుగు వెర్షన్ వరకు మాత్రమే. మిగిలిన వెర్షన్స్ అన్నీ కలుపుకుంటే రూ.40 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus