Mahesh Babu, Prashanth Neel: కేజీఎఫ్2 సినిమాపై మహేష్ అలా రియాక్ట్ అయ్యారా?

మహేష్ బాబు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని మహేష్ అభిమానులతో పాటు ప్రశాంత్ నీల్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కేజీఎఫ్2 సినిమా సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ సైతం వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను , ఇతర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. కేజీఎఫ్2 సినిమా విడుదలైన తనకు ఫస్ట్ ఫోన్ కాల్ చేసింది మహేష్ బాబు అని ప్రశాంత్ నీల్ తెలిపారు.

Click Here To Watch NOW

మహేష్ బాబు కేజీఎఫ్2 గురించి ప్రశంసించారని పరోక్షంగా ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఎవరైనా ఫోన్ కాల్ చేశారంటే మన వర్క్ ను అభినందిస్తున్నారని అర్థం చేసుకోవాలని తాను ఎక్కువ మందితో రిలేషన్ ను డెవలప్ చేసుకోవడానికి ఇష్టపడతానని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. మహేష్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వేర్వేరుగా సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ గతంలో ఒకసారి ఎన్టీఆర్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్ చేయగా తనను ట్రోల్ చేశారని ఆ ట్రోల్స్ తనను ఎంతగానో బాధ పెట్టాయని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు.

అయితే ట్రోల్ చేసిన వాళ్లను బ్లేమ్ చేయలేమని తన గురించి తెలియదు కాబట్టి వాళ్లు అలా చెప్పి ఉండవచ్చని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ దగ్గర మహేష్ బాబుకు సూట్ అయ్యే కథ కూడా ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రశాంత్ నీల్ కు అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర ఇండస్ట్రీల హీరోలు సైతం ప్రశాంత్ నీల్ తో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రశాంత్ నీల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus