రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన అద్భుతమైన కథను రాజమౌళి జనరంజకంగా తెరకెక్కిస్తూ ఆర్ఆర్ఆర్ పోస్టర్ల ద్వారా, టీజర్ల ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి దాదాపుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటం,
తాజాగా రిలీజైన పోస్టర్ లో అక్టోబర్ 13వ తేదీనే రిలీజవుతుందని పేర్కొనడంతో ఆర్ఆర్ఆర్ రాజమౌళి ప్రకటించిన డేట్ కే రిలీజవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఆర్ఆర్ఆర్ కు అసలు సమస్య వేరే ఉందని ఆ సమస్యకు సంబంధించిన లెక్కలు తేలితేనే సినిమా అనుకున్న తేదీకి రిలీజవుతుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ శాటిలైట్, డిజిటల్ హక్కులు రికార్డు రేటుకు అమ్ముడయ్యాయి. థియేటర్ల నుంచి కనీసం 600 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ అనిపించుకుంటుంది.
అయితే కరోనా కేసులు పూర్తిగా తగ్గడం, ఇండియా అంతటా థియేటర్లు ఓపెన్ కావడం, ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ఇతర అంశాలను బట్టి ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఉంటుందని సమాచారం. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఏ సమస్య వచ్చినా నిర్మాతకు భారీ మొత్తంలో లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీలో చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!