జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని సమాచారం అందుతోంది. పవన్ ఓజీ (OG Movie) , హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలలో ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలకు పవన్ చెరో 20 డేట్లు ఇస్తే సరిపోతుంది.
Pawan Kalyan
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మాత్రం పవన్ డేట్లు ఎక్కువ సంఖ్యలో అవసరం కాగా పవన్ (Pawan Kalyan) వారంలో 5 రోజులు షూటింగ్ లకు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పవన్ అలా ప్లాన్ చేసుకుంటే మాత్రమే నిర్మాతల సమస్యలు తీరే అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కాకపోవడం కూడా ఫ్యాన్స్ ను ఒకింత బాధ పెడుతోంది. పవన్ పొలిటికల్ గా ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి ఒక సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలు వాయిదా పడితే నిర్మాతలపై కూడా ఆర్థికంగా భారం పెరుగుతుందనే సంగతి తెలిసిందే. సినిమా ఆలస్యం కావడం హరిహర వీరమల్లు మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతుండగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ను సైతం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ ప్రాజెక్ట్ లలో నటించి పాన్ ఇండియా రేంజ్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. పవన్ షూటింగ్ లకు రావడం మరింత ఆలస్యమైతే నిర్మాతలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.