బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, సలార్ లాంటి టైటిల్స్ ను మొదట విన్న సమయంలో ఈ టైటిల్స్ కొత్తగా అనిపించడంతో పాటు గతంలో ఎప్పుడూ వినని టైటిల్స్ కావడంతో ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతోంది. అదే సమయంలో ఈ టైటిల్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించేలా ఉండటం ఈ తరహా టైటిల్స్ ఉన్న సినిమాలకు ప్లస్ అవుతోంది. ఈ సినిమా టైటిల్స్ మీనింగ్ కూడా కొత్తగా ఉండటం కూడా సినిమాలకు కలిసొస్తుంది.
టైటిల్స్ తోనే దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒక విధంగా టైటిల్స్ కూడా ఈ ఇద్దరు దర్శకుల సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక్కో సినిమా కోసం ఈ ఇద్దరు దర్శకులు ఏడాది నుంచి రెండేళ్ల సమయం కేటాయిస్తున్నారు. అయితే ఈ డైరెక్టర్ల కష్టానికి తగిన ఫలితం దక్కుతుండటంతో పాటు సినిమాసినిమాకు ఈ దర్శకుల రేంజ్ కూడా పెరుగుతోంది. ఈ ఇద్దరు డైరెక్టర్లు టాలీవుడ్ స్టార్ హీరోలతోనే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబుతో తెరకెక్కుతుండగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సలార్ మూవీ షూటింగ్ ఇప్పటికే 35 శాతం పూర్తైందని సమాచారం అందుతోంది. ప్రతి నెలా 15 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుందని బోగట్టా. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. సలార్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. సలార్ మూవీ 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా మహేష్ రాజమౌళి కాంబో మూవీ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుంది.