అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) ఈరోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. నిన్న నైట్ నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకుల్లో మెజారిటీ పర్సెంటేజ్ ఆడియన్స్ బాగుంది అంటున్నారు. వాళ్ళ టాక్ ప్రకారం సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్ హాఫ్, అల్లు అర్జున్ యాక్టింగ్.. బాగా వచ్చాయట. అయితే ఇంకొంతమంది సినిమా సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదు, క్లైమాక్స్ హడావిడిగా తేల్చేసారు అని అంటున్నారు.
Pushpa 2 The Rule
ఇలాంటి నెగిటివ్ టాక్.. ‘పుష్ప 2’ వంటి హైప్డ్ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ పై ఎటువంటి ప్రభావం చూపదు అనే చెప్పాలి. అయితే ‘పుష్ప 2’ లో చాలా ప్రశ్నలకి జవాబులు దొరకలేదు. ‘పుష్ప 3’ కోసం వాటిని సుకుమార్ అలా వదిలేశాడేమో అని అంటున్నారు. ఇంతకీ అవి ఏ ప్రశ్నలు అంటే :
పార్ట్ 1 క్లైమాక్స్ లో జాలి రెడ్డి(ధనుంజయ) పాత్రకి సెకండ్ పార్ట్..లో ప్రాముఖ్యత ఉంటుంది అన్నట్టు చూపించాడు. ట్రైలర్లో కూడా ధనుంజయ కనిపించాడు.కానీ సినిమాలో అతని పాత్ర లేదు. ఆ పాత్రకి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో?
ఇక మంగళం శీను(సునీల్) (Sunil) పాత్రని అతని భార్య దాక్షాయణి (అనసూయ) (Anasuya Bhardhwaj) పీక కోసేస్తున్నట్టు చూపించారు. సెకండ్ పార్ట్ లో అతను ఎలా బయటకు వచ్చాడు. అసలు మంగళం శీను- దాక్షాయణి..ల మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని సరిగ్గా చూపించలేదు. డైరెక్ట్ గా వాళ్ళు పుష్ప పై రివేంజ్ తీర్చుకోవడానికి డ్యూటీ ఎక్కేశారు
సెకండ్ పార్ట్ షూటింగ్ టైంలో.. ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ ఓ వీడియో వదిలారు? ‘పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే అది పుష్పని చూసే’ అన్నారు మంచి ఎలివేషన్ ఉన్న డైలాగ్ అది. కానీ సెకండ్ పార్ట్ లో అది లేదు. అసలు పుష్ప కి బుల్లెట్ తగిలింది అనే సీక్వెన్స్ కూడా లేదు
‘పుష్ప 2’ లో ఫస్ట్ సీన్లోనే హీరో ఇంట్రడక్షన్ జపాన్లో పెట్టాడు సుకుమార్. ఆ తర్వాత అతనికి ఓ బుల్లెట్ తగలడంతో సముద్రంలో పడిపోయినట్లు చూపించారు. ఆ ట్రాక్ కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. వీటికి సమాధానాలు దొరకాలంటే ‘పుష్ప 3 : ది రాంపేజ్’ వచ్చే వరకు ఆగాలేమో.