పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని అందరూ భావించగా ఈ సినిమా అందుకు భిన్నమైన ఫలితాన్ని అందుకుంది. అటు పూరీ జగన్నాథ్ అభిమానులకు ఇటు విజయ్ దేవరకొండ అభిమానులకు సైతం ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన సీన్లను తీసేశారని తెలుస్తోంది. నిడివి ఎక్కువ అవుతుందని భావించి లైగర్ సినిమాలో ఆ సన్నివేశాలను ఎడిటింగ్ సమయంలో తీసేశారని బోగట్టా.
డిలీట్ చేసిన సీన్లలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, లైగర్ తండ్రి నేపథ్యం గురించి ఉందని బోగట్టా. అయితే ఆ సీన్లు ఉండి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేవో మైనస్ అయ్యేవో కచ్చితంగా చెప్పలేము. ఇప్పటికీ లైగర్ సినిమాపై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ శ్రద్ధ పెట్టి తెరకెక్కించకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాపైందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం విజయ్ దేవరకొండ కెరీర్ కంటే పూరీ జగన్నాథ్ కెరీర్ పై ఎక్కువగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ దర్శకులను గుడ్డిగా నమ్మకుండా కథలపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలు సక్సెస్ సాధించని పక్షంలో ఆయన కెరీర్ విషయంలో తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
లైగర్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కూడా ఊహించని స్థాయిలో తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విజయ్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతాయో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.