‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్సే. బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమా వల్ల ఎవరికైనా ప్లస్ అయ్యిందా? అంటే అది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మాత్రమే అని చెప్పాలి. సినిమా కథ, కథనాలు ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు. రవితేజ అభిమానులు అయితే బాగా డిజప్పాయింట్ అయ్యారు.
కానీ హీరోయిన్ గ్లామర్ విషయంలో సక్సెస్ అయ్యింది. అందుకే భాగ్య శ్రీకి వెంటనే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ‘కింగ్డమ్’ వంటి సినిమాల్లో ఛాన్సులు లభించాయి. అలాగే మరో 2 పెద్ద సినిమాలకి కూడా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు బాగానే ఉన్నాయి. కానీ స్టార్ గా ఎదగాలి అంటే సక్సెస్ చాలా ముఖ్యం.
విచిత్రంగా భాగ్య శ్రీ నటిస్తున్న ‘కింగ్డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలు దాదాపు పూర్తి కావచ్చాయి. ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నిర్మాత నాగవంశీ అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కథలో చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. ఆ వెంటనే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో భాగ్య శ్రీ బోర్సే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 సినిమాల ఫలితాలపై భాగ్య శ్రీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని చెప్పాలి.