అనుపమ కెరీర్ లో కీలకం కానున్న ఈ రెండు చిత్రాలు!
- September 23, 2017 / 11:57 AM ISTByFilmy Focus
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళ చిత్రం ప్రేమమ్ మూవీతో యువకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు ప్రేమమ్ లోను సుమ గా ఆకట్టుకుంది. రీసెంట్ గా శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో టాలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. అయినా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన “ఉన్నది ఒకటే జిందగీ” లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ దశలో ఉంది. త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. ఈ చిత్రంతో పాటు నేచురల్ స్టార్ నాని సరసన కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించనుంది.
ఇందులో అనుపమ న్యూలుక్‌తో కనిపించనుంది. ప్రస్తుతం నాని MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) చేస్తున్నారు. ఇది కంప్లీట్ కాగానే కృష్ణార్జున యుద్ధం మొదలు కానుంది. అనుపమకు “ఉన్నది ఒకటే జిందగీ”, కృష్ణార్జున యుద్ధం చిత్రాలు కెరీర్ లో కీలకం కానున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి హిట్ అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.














