Dil Raju: దిల్ రాజు కి బెదిరింపులు… హనుమాన్ మూవీ కోసం రంగంలోకి దిగిన విశ్వ హిందూ పరిషత్!

సంక్రాంతి సీజన్ మొదలైంది అంటే టాలీవుడ్లో ఎక్కువగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే తన సినిమాలకు ఎక్కువ ధియోటర్స్ లాగేసుకుంటాడు అనే అపోహ ఉంది కాబట్టి..! గతేడాది వీరసింహారెడ్డి , వాల్తేరు వీరయ్య.. సినిమాలకు నైజాంలో ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ ఇవ్వకుండా తాను నిర్మించిన వారసుడు సినిమాకి ఇచ్చుకుంటున్నాడు అని దిల్ రాజు పై ట్రోలింగ్ గట్టిగా జరిగింది. తర్వాత అది నిజం కాలేదు.ఆ రెండు సినిమాలకు ధియోటర్స్ వదిలాడు. ఈ ఏడాది దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన సినిమాలు లేవు. ఫ్యామిలీ స్టార్ కూడా వాయిదా పడింది. అయినప్పటికీ ఇప్పుడు దిల్ రాజు పై ట్రోలింగ్ జరుగుతుంది.

ఎందుకంటే గుంటూరు కారం నైజాం హక్కులను ఆయన భారీ రేటు పెట్టి కొనుగోలు చేశాడు. దీంతో తాను పెట్టింది అంతా కూడా మొదటి వారం వెనక్కి తెచ్చుకోవాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు అని అంతా అనుకున్నారు. కాబట్టి గుంటూరు కారం మొదటి రోజున అంటే జనవరి 12న ..హైదరాబాద్ లో ఏకంగా 95 శాతం స్క్రీన్స్ బ్లాక్ చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అదే రోజు రిలీజ్ కాబోతున్న హనుమాన్ సినిమాకి కేవలం 4 శాతం సింగిల్ స్క్రీన్స్ మాత్రమే దక్కుతున్నాయి అని కొందరి అభిప్రాయం.

దీంతో దిల్ రాజుని కొంతమంది గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. కానీ మిగిలిన సినిమాలకు ఇబ్బంది కలగకుండా దిల్ రాజు చేస్తున్న ప్రయత్నాలు అంతా మరిచిపోయారు. అది పక్కన పెడితే..లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే.. దిల్ రాజుకి విశ్వ హిందూ పరిషత్ అలాగే భజ్ రంగ్ దళ్ సంఘాల వారు ఫోన్లు చేసి బెదిరింపులకు, కేసులు వేయడానికి కూడా పాల్పడుతున్నారట. ‘దేవుడితో పెట్టుకోకు .. హనుమాన్ సినిమాకి ఎక్కువ ధియోటర్స్ ఇవ్వు లేదు అంటే లీగల్ నోటీసులు పంపుతాము ‘అంటూ దిల్ రాజుకి అల్టిమేటం జారీ చేశారట. దీంతో దిల్ రాజు చిక్కుల్లో పడినట్లు ప్రచారం జరుగుతుంది.

మరోపక్క హనుమాన్ చిత్రం కూడా జనవరి 12నే రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తుంది. మైత్రి, దిల్ రాజు..ల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా ఎప్పటి నుండో జరుగుతుంది. కాబట్టి దిల్ రాజు పై పగతో మైత్రి వారి తరఫున హనుమాన్ మేకర్స్ ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారనే టాక్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus