టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మూవీ మే 12న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ మొదటి వారం బాగానే కలెక్ట్ చేసింది. అయితే నైజాంలో మాత్రం ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అందుకు ప్రధాన కారణం టికెట్ రేట్లు భారీగా పెంచేయడం వలెనే అని చెప్పాలి. అయినప్పటికీ డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది అది వేరే విషయం.
మొదటి వారం ఈ మూవీ రూ.98 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది అని అంచనా.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.24 కోట్ల వరకు కలెక్ట్ ను రాబట్టాలి. నైజాంలో భారీగా కలెక్ట్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు 8 వ రోజు అంటే మే 19 గురువారం నుండీ టికెట్ రేట్లు తగ్గాయి. మల్టీప్లెక్సుల్లో ఒక్క ఐనాక్స్ లో తప్ప మిగిలిన అన్నిటిలో టికెట్ రేట్లు రూ.295 గా, సింగిల్ స్క్రీన్స్ లో రూ.175 గా ఉన్నాయి.
ఈ టికెట్ రేట్లతో రెండో వీకెండ్ ను ఈ మూవీ ఎంత వరకు క్యాష్ చేసుకుంటుంది అనేది చూడాలి. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి.. టికెట్ రేట్లు తగ్గడం అనేది కొంత ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అయితే వచ్చేవారం నుండీ ‘ఎఫ్3’ కూడా థియేటర్లకు రాబోతుంది. ఆ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ సినిమా కనుక హిట్ అయితే ‘సర్కారు వారి పాట’ లాంగ్ రన్ కు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఆ మూవీ వచ్చేలోపే టార్గెట్ ను అందుకోవాలి. ఇప్పటికైతే ఒక్క ఓవర్సీస్లో తప్ప మిగిలిన ఏ చోట కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించలేదు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!