ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నాలుగు షోలకు అనుమతి ఇచ్చింది. దాంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందడి’ వంటి సినిమాలు లాభపడ్డాయి. అయితే ఇప్పటివరకు టికెట్ రేట్లు పెంచే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు ఈ టికెట్ రేట్ల విషయంలో ఏమైనా హెల్ప్ చేస్తాడా అని ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ‘మా’ ఎన్నికల సమయంలో జగన్ తన బావ అని మంచు విష్ణు ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే సంక్రాంతి టైమ్ కి డెసిషన్ వస్తుందని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాలు జనవరిలో విడుదల కానున్నాయి. ఎన్టీఆర్ తరఫున మంచి కొడాలి నాని కూడా టికెట్ రేట్ల గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు. అందుకే జనవరిలో టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చని చెబుతున్నారు. మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలకు మించి ఒక్క పైసా కూడా రేటు పెరగదు.
కాకపోతే 20,30 రూపాయల కనీస టికెట్ రేట్లను 50 నుంచి 55 రూపాయలకు పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందట. అయితే ప్రభుత్వ ఆదేశాలు, రూల్స్ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో భారీ సినిమా విడుదలైనప్పుడు మొదటిరోజు ఎక్కువ రేట్లతో షోని ఆడించడం కామన్. వంద రూపాయల టికెట్ ను వేళల్లో అమ్ముతారు.