రాజమౌళి – మహేష్‌బాబు సినిమా ఎప్పుడు? అంటూ ఈ మధ్య వరకు ప్రశ్నలు అడిగేవారు. ఈ ఇద్దరిలో ఎవరు కనిపించినా ఇదే ప్రశ్న వచ్చేది. అయితే సినిమా కన్ఫామ్ అవ్వడంతో ఇప్పుడు ప్రశ్న మారింది. సినిమా కథేంటి? అనేది తాజా ప్రశ్న. దానికి కారణం రాజమౌళి – మహేష్ సినిమా కథ ఇదేనంటూ ఇప్పటివరకు మూడు కాన్సెప్ట్‌లు బయటకు రావడం. అడవులు నేపథ్యంలో సినిమా అని చాలా రోజులుగా వినిపిస్తున్నా… ఇప్పుడు కొత్తగా రెండు బయటికొచ్చాయి.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ కథను సినిమా తీస్తారని రాజమౌళి – మహేష్‌బాబు సినిమా గురించి పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీని కోసం ఓ ఆంగ్ల నవల హక్కుల్ని కూడా తీసుకున్నారని చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా కథ అది కాదని, జేమ్స్ బాండ్ స్టయిల్‌లో ఉండబోతోందని చెప్పుకొచ్చారు. మహేష్‌బాబు కూడా ఈ కథ మీద ఆసక్తి చూపిస్తున్నాడని అన్నారు. తొలుత అనుకున్న కథ కంటే ఇది స్టయిలిష్ ఉంటుందని అనుకోవడమే కారణమట. కానీ ఇప్పుడు టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ అంటున్నారు.
టైమ్ మెషీన్ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఓ కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. ‘ఆదిత్య 369’ తరహాలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన కథ అడ్వెంచరస్ స్టోరీ అని సమాచారం. ఇలాంటి కథ ఇప్పటివరకు రాజమౌళి నుండి రాలేదు. కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రాజమౌళికి ఇలాంటి లార్జర్ దేన్ లైఫ్ కథలంటే బాగా ఇష్టం కూడా. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ మధ్య రాజమౌళి మాట్లాడుతూ మహేష్ సినిమా కోసం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని, మరోసారి కలిసి ఏదో ఓ కథను ఫైనల్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మూడో కథ గురించి పుకార్లు రావడం మొదలయ్యాయి. కాబట్టి రాజమౌళి కథను ఫైనలైజ్ చేసి క్లారిటీ ఇచ్చేయాలి. సినిమా మొదలయ్యాక ఎలాగూ ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ చెబుతారు కాబట్టి… ఎక్కువ రోజులు వెయిట్ చేయనక్కర్లేదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!