Chandra Mohan: చంద్ర మోహన్ మరణం తీరని లోటు!
- November 11, 2023 / 08:16 PM ISTByFilmy Focus
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు చంద్రమోహన్ ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చంద్రమోహన్ నేడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ విధంగా చంద్రమోహన్ మరణించడంతో ఆయన మరణం పట్ల ఎంతోమంది స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. చంద్రమోహన్ మరణం పై చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, మంచు విష్ణు నారా లోకేష్ ఇటువంటి సినీ రాజకీయ నాయకులు స్పందించారు.
ఈ సందర్భంగా చంద్రమోహన్ మరణం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ అకాల మరణం చాలా బాధాకరం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. ఇక చంద్రమోహన్ మరణం పై బాలకృష్ణ స్పందిస్తూ..

చంద్రమోహన్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలలోనూ పౌరాణిక చిత్రాలలో నటిస్తూ తన హాస్యంతో అందరిని ఆకట్టుకున్నారని నాతో కలిసి కొన్ని సినిమాలలో తాను నటించానని ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ కూడా చంద్రమోహన్ మరణ వార్త పై స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇలా చంద్రమోహన్ (Chandra Mohan) మరణ వార్త గురించి పలువురు సెలబ్రిటీలందరూ కూడా స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు ఇక ఈయన అంత్యక్రియలు సోమవారం జరగబోతున్నాయని తెలుస్తుంది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!














