ఒకసారి గతంలోకి అంటే 2019 సంక్రాంతి టైంకి వెళ్తే.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘వినయ విధేయ రామ’ ‘ఎఫ్2’ వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటనలు వచ్చాయి. అయితే వీటి మధ్యలో అనూహ్యంగా రజినీకాంత్ ‘పేట’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఆ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేసిన వల్లభనేని అశోక్ తెలియజేశారు. అయితే తర్వాత ఆయన దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వాళ్ళు థియేటర్లు ఇవ్వడం లేదని మీడియా ముందు అభ్యంతరాలు తెలిపారు.
దీనికి పై దిల్ రాజు స్పందించి చాలా సీరియస్ అయ్యారు. సంక్రాంతి టైంలో తెలుగు మూవీస్ చాలా రిలీజ్ కు రెడీగా ఉంటాయి. ఆ టైంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు అడ్జస్ట్ చేయడం కుదరదు.మధ్యలో వచ్చి మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అంటే ఎలా థియేటర్స్ ఇచ్చేస్తారు? ఈ విషయం పై మీడియా కూడా మాకు సహకరించాలి అంటూ దిల్ రాజు తెలిపారు. అలా చెప్పిన దిల్ రాజు..
2021 సంక్రాంతి టైంలో రవితేజ ‘క్రాక్’ సినిమాని కాదని విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చాడు. అయితే ఇప్పుడు అంటే 2023 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల పై మాస్ ఆడియన్స్ లో భారీ క్రేజ్ నెలకొంది. కానీ ఈ రెండు పెద్ద సినిమాల కంటే ఎక్కువగా తన నిర్మాణంలో రూపొందుతున్న డబ్బింగ్ మూవీ ‘వారసుడు'(వరిసు) కి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకున్నాడట దిల్ రాజు.
ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలను కాదు అని డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఎలా ఇస్తారు అంటూ దిల్ రాజు పై టాలీవుడ్ ప్రేక్షకులు మండిపడుతున్నారు. మరి ఈ విషయం పై దిల్ రాజు ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. 2022 సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద సినిమా ‘బంగార్రాజు’ ని కూడా కాదని తన సినిమా ‘రౌడీ బాయ్స్’ కి దిల్ రాజు ఎక్కువ థియేటర్లు ఇచ్చుకున్న సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మరీ దిల్ రాజుని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.