“మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు.. కొడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం స్టైల్ అయిపోవాలి” .. జులాయి సినిమాలో రవి పాత్ర పోషించిన అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఇది. వాస్తవంగా ఆర్ధిక ఇబ్బందులు పడే యువకుల్లో చాలామంది ఇదే విధంగా ఆలోచిస్తుంటారు. కానీ కోట్లకు వారసులైనప్పటికీ కొంత మంది యువ హీరోలు సంపన్నుల వారసురాళ్లపై మనసు పారేసుకుంటున్నారు. ‘హార్ట్ లవ్.. లవ్.. అన్నదంటే లో క్లాస్, హై క్లాస్ చూసుకోదు ప్రేమ కేసు” అంటూ సినిమాల్లో కథానాయకులు పాటల్లో చెప్పినట్లే బిలినియర్ బేటీలు ఆస్తిని చూసుకోవడం లేదు. మనసును గెలిచిన స్టార్ తో ఏడడుగులు వేయడానికి సంతోషంగా అంగీకరిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ పెద్ద పారిశ్రామికవేత్త, అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనుమరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లిచేసున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పెళ్లి చేసుకున్న వెరోనికా బంగారు స్పూన్ తోనే పుట్టిన అమ్మాయి. కోట్లకు అధిపతురాలు. ఇక త్వరలో పెళ్లి కొడుకు కానున్న అక్కినేని అఖిల్ మనసుపడిన అమ్మాయి శ్రేయ భూపాల్ గురించి అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన జీవీకే రెడ్డి మనుమరాలు ఆమె. అక్కినేని ఇంటి కోడలు కాబోతోంది. ఇక్కడ సమాధానం దొరకని ప్రశ్న ఏంటంటే… యువహీరోలకు నచ్చిన అమ్మాయిలకు కోట్లు ఉంటోందా ? కోట్లున్న అమ్మాయిలే వీరికి నచ్చుతున్నారా ? అని. ఇదంతా చదివి మీరు మాత్రం “ప్రేమ ఇది తే.. అది తే అని అడుగునా.. ప్రేమ స్థితిని, గతిని అన్నీ చూచునా” అని బాయ్స్ లోని పాటను పాడొద్దు.