తెలుగు హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. రౌడీలను చితక కొట్టాలి. హీరోయిన్ తో రొమాన్స్ చెయ్యాలి. అంతేకాదు మేజర్ ఆడియన్స్ బట్టి మన రచయితలు, దర్శకులు క్యారెక్టర్స్ డిజైన్ చేస్తుంటారు. అందులో కులానికి చెందిన ప్రస్తావన కూడా ఉంటుంది. అందుకే బ్రాహ్మణులను చిన్న పాత్రల్లో చూపిస్తారు. కానీ పూర్తి నిడివి ఆచారి పాత్రలో మన స్టార్స్ కనిపించి ఆకట్టుకున్నారు. ఆ సినిమాలపై ఫోకస్..
ఆచారి అమెరికా యాత్ర మంచు విష్ణు, బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ “ఆచారి అమెరికా యాత్ర”. గతంలో దేనికైనా రెడీ సినిమాలో కాసేపు పండితుడిగా వేషం వేసిన మంచు విష్ణు.. ఈ మూవీలో బ్రాహ్మణుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
దువ్వాడ జగన్నాథం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి బ్రాహ్మణుడిగా నటించిన సినిమా దువ్వాడ జగన్నాథం. ఇదివరకు ఆచారి అంటే సాఫ్ట్ గా ఉంటారు అనే మాటను డీజేతో బన్నీ మార్చనున్నాడు.
అదుర్స్ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ కూడా ఆచారిగా అదుర్స్ సినిమాలో నటించారు. కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు.
దశవతారం విశ్వనటుడు కమల హాసన్ దశవతారం సినిమాలో పది పాత్రలు పోషించారు. అందులో రెండు బ్రాహ్మణ పాత్రలు. ఒకటి బామ్మ అయితే మరొకటి రంగరాజా నంబి. అన్ని పాత్రలను చక్కగా పోషించి తిరుగులేదని అనిపించారు.
పాండురంగడు నటసింహ బాలకృష్ణ సినిమా అంటే అదిరే డైలాగులు, భారీ ఫైట్లు ఉంటాయి. వాటన్నింటికీ వ్యతిరేకంగా పాండురంగడు సినిమాలో పండితుడిగా అందరితో కన్నీరు పెట్టించారు.
ముగ్గురు మొనగాళ్లు మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో పృథ్వి, విక్రమ్, దత్తాత్రేయ గా మూడు పాత్రలు పోషించారు. నృత్య గురువు దత్తాత్రేయగా చిరు తనదైన శైలిలో అదరగొట్టారు.
అన్నమయ్య నాగార్జున సినీ కెరీర్ లో అన్నమయ్యకి ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ హిట్ అయినా ఈ సినిమాలో ఆ వేంకటేశ్వరుడి భక్తుడిగా, బ్రాహ్మణుడిగా నటించి మెప్పించారు.
అపరిచితుడు తమిళ డైరక్టర్ శంకర్ అద్భుత చిత్రాల్లో అపరిచితుడు ఒకటి. ఇందులో విక్రమ్ రామానుజంగా నటించిన తీరు శెభాష్ అనిపించింది.
చక్రధారి సాంఘిక చిత్రాల కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు ఆచారిగా నటించి అభినందనలు అందుకున్న మూవీ చక్రధారి. ఇందులో అతని మాట తీరు, నడవడిక మొత్తం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిగా వ్యక్తిగా ఉండడం ఏఎన్నార్ నటన గొప్పతనం.
పాండురంగ మహత్యం మహా నటుడు నందమూరి తారక రామారావు పోషించని పాత్ర అంటూ లేదు. దేవుడిగా, రావణాసురుడిగా నటించి ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. పాండురంగ మహత్యం లో బ్రాహ్మణుడిగా నటించి ప్రశంసలు అందుకున్నారు.
వీరితో పాటు శోభన్ బాబు, రాజ శేఖర్ , అల్లరి నరేష్ తదితరులు బ్రాహ్మణులుగా నటించి విజయాన్ని అందుకున్నారు.