‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ ఇస్తూ చిత్ర యూనిట్ సభ్యులు ఓ ప్రోమోని విడుదల చేశారు. అందులో ‘ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్?’ అని మురళీ శర్మ అడిగితే.. ‘ఇవ్వలేదు వచ్చింది’ అంటూ మన బన్నీ అంటాడు. ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. అయితే కొంతమంది టాలీవుడ్ హీరోలు ఊహించని విధంగా సినిమాకి .. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు? వాళ్ళకి ఈ డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుంది అనే చెప్పొచ్చు. వాళ్ళు కావాలనే గ్యాప్ ఇచ్చారా లేక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చెయ్యడం వల్ల గ్యాప్ వచ్చిందా? అంటే కచ్చితంగా వాళ్లకు నచ్చిన స్క్రిప్ట్ దొరికే వరకూ వెయిట్ చెయ్యడం వల్లే గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు.
అయితే స్క్రిప్ట్ దొరికాక అది పట్టాలెక్కించి విడుదల చెయ్యడానికి కూడా మరింత టైం పడుతుంది కాబట్టి.. గ్యాప్ మరింతగా పెరుగుతుందనే చెప్పాలి. మరి ఇప్పటి టాలీవుడ్ జనరేషన్లో ఎక్కువ గ్యాప్ తీసుకున్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) మహేష్ బాబు : ‘అతిథి’ (2007) – ‘ఖలేజా'(2010) : 1085 రోజుల గ్యాప్
2) రవితేజ : ‘బెంగాల్ టైగర్'(2015) – ‘రాజా ది గ్రేట్'(2017) : 678 రోజుల గ్యాప్