“టాలీవుడ్ నన్ను పట్టించుకోవట్లేదు” అని వాపోతున్న ఈ నైరా బెనర్జీ ఎవరా? అని ఆశ్చర్యపోతున్నారా?. ఆమె మరెవరో కాదంది.. “సరదాగా కాసేపు, కొత్త జంట” ఇటీవల “టెంపర్” సినిమాల్లో నటించిన మధురిమ బెనర్జీ. ఇటీవల “ఒన్ నైట్ స్టాండ్” అనే సినిమాలో రెచ్చిపోయి మరీ “బోల్డ్ సీన్స్”లో జీవించేసిన మధురిమ బెనర్జీ అలియాస్ నైరా బెనర్జీ, తనను టాలీవుడ్ లో పట్టించుకోలేదు.
తెలుగులో కేవలం హిట్స్ ఉన్న హీరోయిన్స్ వెనకే దర్శకనిర్మాతలు పరిగెడతారు కానీ.. టాలెంట్ ను పట్టించుకోరు. అందుకే నాకు తెలుగులో సరైన అవకాశాలు లభించట్లేదని చెబుతోంది నైరా బెనర్జీ. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు సైన్ చేసానని, త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని కూడా చెప్పుకొచ్చింది!