కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ లో హిట్ కొట్టడం ఆనవాయితీ. డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ రజనీకాంత్, కమలహాసన్, సూర్య, విక్రమ్ సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అయ్యాయి. కానీ మన హీరోల సినిమాలు మాత్రం తమిళనాడులో పెద్దగా ఆడలేదు. బాహుబలి చిత్రాలు మినహా ఏ మూవీ మంచి వసూళ్లను సాధించలేదు. తమిళంలో తెలుగు సినిమాల మార్కెట్ పెరగడానికి బాహుబలి శుభారంభం చేశాయి. అయితే ఇప్పుడు హీరోలు కోలీవుడ్ లో స్పీడ్ పెంచుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ నిన్న తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోను భారీగా రిలీజ్ అయింది.
అక్కడి థియేటర్స్ హౌస్ ఫుల్ అయి డిస్ట్రిబ్యూటర్స్ కి సంతోషం కలిగించింది. ‘బాహుబలి’ తో పాపులర్ అయిన రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ తమిళ్‌లో ‘నాన్ ఆనయిట్టాల్’గా రేపే గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయని అక్కడి ట్రేడ్ వర్గాలవారు చెబుతున్నారు. ఇక మహేశ్ బాబు, మురుగదాస్ క్రేజీ మూవీ ‘స్పైడర్’ ఈ నెల 27న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతోంది. మరి రికార్డులు తిరగరాస్తాడా? లేదా? అనేది మరో వారం రోజుల్లో తెలియనుంది.