కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమాకు రెండేళ్ల సమయం కేటాయిస్తూ ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిదానమే ప్రధానమని టాలీవుడ్ స్టార్ హీరోలు భావిస్తుండటం గమనార్హం. గతంతో పోలిస్తే భారీ బడ్జెట్ సినిమాల హీరోలు, దర్శకులు సైతం ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ విడుదలై ఆరు నెలలైంది. పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. సుకుమార్ పుష్ప ది రైజ్ సక్సెస్ ను దృష్టిలో ఉంచుకుని పుష్ప ది రూల్ స్క్రిప్ట్ లో చేస్తున్న మార్పుల వల్లే ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. పుష్ప2 షూటింగ్ మొదలుకావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ కూడా అంతకంతకూ ఆలస్యమవుతోంది.
స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాతే షూటింగ్ ను మొదలుపెడదామని జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివకు సూచించారని సమాచారం. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ కొన్ని నెలల క్రితమే మొదలుకావాల్సి ఉన్నా త్రివిక్రమ్ ఇంకా ఈ స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉన్నారని తెలుస్తోంది. జూన్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందో లేదో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం ఎంతో కష్టపడుతూ ఈ సినిమాకు ఎక్కువ డేట్లు కేటాయిస్తూ ఈ సినిమా విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు.
రామ్ చరణ్ శంకర్ మూవీ కూడా నిదానంగానే షూటింగ్ జరుపుకుంటోందని 2023 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ కూడా నిదానంగానే జరుగుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల విజయాలతో ప్రశాంత్ నీల్ రేంజ్ పెరగగా సలార్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ సాధించాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారు. అయితే ఈ హీరోలు ఆలస్యంగా సినిమాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.