కోవిడ్ టైంలో థియేటర్లు 9 నెలల పాటు మూతపడి ఉన్నాయి. ఆ టైంలో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందించింది ఓటీటీలే. ప్రాంతీయ బేధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా.. ఆ టైంలో ప్రేక్షకులు అన్ని భాషల్లో రూపొందిన సినిమాలను చూసేశారు. అందువల్ల వాళ్ళు బాగా అప్డేట్ అయ్యారని చెప్పొచ్చు. ఏదో ఒక కొత్తదనం లేకపోతే.. వాళ్ళు థియేటర్ కి వచ్చి సినిమా చూడట్లేదు. అందువల్ల చాలా మంది సక్సెస్- ఫుల్ డైరెక్టర్స్ (Directors) కోవిడ్ తర్వాత ప్లాపులు ఇచ్చారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
Directors
1) కొరటాల శివ :
రాజమౌళి (S. S. Rajamouli) తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న కొరటాల శివ (Koratala Siva).. కోవిడ్ కి ముందు చిరుతో ‘ఆచార్య’ సినిమా సెట్ చేసుకున్నారు. కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. కొరటాల సక్సెస్..లకి బ్రేకులు వేసిన సినిమా ఇది. తర్వాత ‘దేవర ‘ (Devara) (మొదటి భాగం) తో కమర్షియల్ సక్సెస్ అందుకొని గట్టెక్కాడు.
2) శంకర్ :
ఇండియన్ జేమ్స్ కెమరూన్ గా పేరొందిన శంకర్ (Shankar) .. ‘2.ఓ’ (2.O) తో పర్వాలేదు అనిపించాడు. కానీ కోవిడ్ తర్వాత శంకర్ నుండి వచ్చిన ‘ఇండియన్ 2’/’భారతీయుడు 2’ (Indian 2) డిజాస్టర్ అయ్యింది. అందువల్ల పార్ట్ 3 ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. మరి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తో అయినా శంకర్ గట్టెక్కుతాడేమో చూడాలి.
3) త్రివిక్రమ్ :
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కోవిడ్ కి ముందు ‘అల వైకుంరపురములో’ (Ala Vaikunthapurramulo) అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు. కానీ కోవిడ్ తర్వాత త్రివిక్రమ్ నుండి వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) కమర్షియల్ గా పర్వాలేదు అనిపించినా.. కంటెంట్ పరంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
4) సురేందర్ రెడ్డి :
కోవిడ్ కి ముందుకు ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) తో అలరించిన సురేందర్ రెడ్డి (Surender Reddy) .. కోవిడ్ తర్వాత అఖిల్ తో ‘ఏజెంట్’ (Agent) అనే సినిమా చేసి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇతను స్క్రిప్ట్..లు పట్టుకుని హీరోల కోసం వెతుకుతున్నాడు.
5) అజయ్ భూపతి :
కోవిడ్ కి ముందు అజయ్ భూపతి (Ajay Bhupathi) నుండి వచ్చిన ‘ఆర్ఎక్స్.100’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ కోవిడ్ తర్వాత వచ్చిన ‘మహాసముద్రం’ (Maha Samudram) పెద్ద డిజాస్టర్ అయ్యింది.
6) హరీష్ శంకర్ :
కోవిడ్ కి ముందు హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో (Directors) వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) బాగానే ఆడింది. కానీ కోవిడ్ తర్వాత హరీష్ శంకర్ చేసిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) పెద్ద డిజాస్టర్ అయ్యింది.
7) పూరీ జగన్నాథ్ :
కోవిడ్ కి ముందు ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు పూరీ (Puri Jagannadh) . కానీ కోవిడ్ తర్వాత ‘లైగర్’ (Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి డిజాస్టర్స్ ఇచ్చాడు.
8) శివ నిర్వాణ :
కోవిడ్ కి ముందు ‘మజిలీ’ (Majili) వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న శివ నిర్వాణ (Shiva Nirvana).. కోవిడ్ తర్వాత ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) ‘ఖుషి’ (Kushi) వంటి ప్లాప్స్ ఇచ్చాడు.
9) వివేక్ ఆత్రేయ :
కోవిడ్ కి ముందు ‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) తో ఫామ్లో ఉన్న వివేక్ (Vivek Athreya) .. కోవిడ్ తర్వాత ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ప్లాప్ గా మిగిలింది.
కోవిడ్ కి ముందు ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindhi) వంటి డీసెంట్ హిట్ తో ఫామ్లో ఉన్న దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) .. కోవిడ్ తర్వాత ‘కీడా కోలా’ (Keedaa Cola) వంటి ప్లాప్ ఇచ్చాడు.