భారతీయ చిత్రసీమలో అల్లు అర్జున్ పుష్ప (Pushpa) సిరీస్‌తో ఓ కొత్త హిస్టరీ సృష్టించాడు. తాజాగా విడుదలైన “పుష్ప 2: ది రూల్” (Pushpa 2) కలెక్షన్ల పరంగా మాత్రమే కాదు, ఫుట్‌ఫాల్ విషయంలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రం 7 కోట్ల మందికి పైగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి పోస్ట్ కోవిడ్ కాలంలోనే అత్యధిక ఫుట్‌ఫాల్ సాధించిన సినిమాగా నిలిచింది. బన్నీ క్రేజ్‌కు తగ్గట్టే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పుష్ప 2, బాలీవుడ్ మార్కెట్‌లోనూ 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సౌత్ నుంచి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
Tollywood
ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇది కేవలం బాక్సాఫీస్ పరంగానే కాదు, ప్రేక్షకుల ఆదరణలోనూ అరుదైన రికార్డును సాధించింది. ఇక పుష్ప 2 మాత్రమే కాకుండా, రామ్ చరణ్ (Ram Charan) , ఎన్టీఆర్‌ల (Jr NTR) ఆర్ఆర్ఆర్ (RRR) కూడా పోస్ట్ కోవిడ్ కాలంలో విశేష ప్రేక్షకాదరణ పొందింది. 4.51 కోట్ల ఫుట్‌ఫాల్ సాధించి, తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. అలాగే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎ.డి. (Kalki 2898 AD) 3.61 కోట్ల మందిని థియేటర్లకు రప్పించి ప్రభాస్ (Prabhas) మార్కెట్‌ను మరోసారి ప్రూవ్ చేసింది.
సలార్ (Salaar) 2.70 కోట్ల ఫుట్‌ఫాల్‌తో ప్రభాస్ పాన్ ఇండియా హవాను కొనసాగించాడు. అల్లు అర్జున్ (Allu Arjun) టాలీవుడ్‌లో అత్యధిక ఫుట్‌ఫాల్ కలిగిన హీరోగా నిలిచాడు. పుష్ప 2తో టాప్ స్థానంలో ఉంటూ, పుష్ప: ది రైజ్ ద్వారా 2.50 కోట్ల మందిని థియేటర్లకు రప్పించాడు. బన్నీ సత్తా ఏ స్థాయిలో ఉందో ఈ రెండు సినిమాల విజయాలు మరోసారి స్పష్టం చేశాయి. ఇవన్నీ కలిపి చూస్తే, టాలీవుడ్ (Tollywood) టాప్ 5 ఫుట్‌ఫాల్ చిత్రాల జాబితాలో బన్నీ హవా కొనసాగుతోంది.