గ్లామర్ ఉంది, ఫిగర్ ఉంది, కుర్రాళ్లు కోరుకునే అప్పీల్ ఉంది.. కానీ ఎందుకో మరి దిశా పటానీకి సరైన సినిమా పడటం లేదు. పెద్ద పెద్ద సినిమల్లో వరుస ఛాన్స్‌లు వస్తున్నా ఆమె టాలెంట్‌ను చూపించుకునే అవకాశం దక్కడం లేదు. దీంతో ఆమె పాటల హీరోయిన్ అనే ముద్ర తెలియకుండానే వేయించేసుకుంది. దానికి కారణం రీసెంట్‌గా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) , ‘కంగువ’ (Kanguva) సినిమాలే ఉదాహరణ. ఆ ముద్ర త్వరలో చెరిగిపోయే అవకాశం ఉంది.
Disha Patani
ఎందుకంటే దిశా పటానీ కొత్త ప్రాజెక్ట్ స్థాయి అలాంటిది మరి. ఇక్కడ సరైన సినిమాలు దొరక్క ఇబ్బంది పడుతున్న దిశా పటానీకి హాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ సెట్ అయింది అని చెబుతున్నారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ నటుడు టైరీస్ గిబ్సన్‌తో ఓ వెబ్ సిరీస్ కోసం దిశా పటానీని (Disha Patani) ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సిరీస్ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెక్సికోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో దిశ ఉన్నట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. అంటే భాషతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్న ఈ కథానాయిక.. ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా సత్తా చాటాడానికి సిద్ధమైనట్లే. బాలీవుడ్‌ని, తెలుగు సినిమాను ఉర్రూతలూగించిన దిశ.. ఇప్పుడు తన హాలీవుడ్ ప్రాజెక్టుతో రెడీ అవుతోంది అన్నమాట. దిశ (Disha Patani) లాంటి అందానికి హాలీవుడ్‌లో ఆదరణ బాగుంటుందని చెప్పొచ్చు.
ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. దిశకు అక్కడ ఆదరణ దక్కితే తిరిగి ఇక్కడకు వస్తుందా అనే డౌట్ ఉంది. ఎందుకంటే ఇలాగే హాలీవుడ్‌కి వెళ్లిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తిరిగి ఇండియన్ సినిమాకు రాలేదు. ఇప్పుడు రాజమౌళి (S. S. Rajamouli) – మహేష్ బాబు (Mahesh Babu) సినిమా కోసం వస్తుంది అని అంటున్నారు. దిశ విషయంలోనూ ఇదే జరిగే అవకాశమూ లేకపోలేదు. అయితే ఇలా వెళ్లిన దీపిక పడుకొణె (Deepika Padukone) అయితే తిరిగి వెంటనే వచ్చేసింది.