వివాదాలతో వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలు వీళ్లే!

2021 సంవత్సరం ముగింపుకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలకు ఈ ఏడాది నటించిన సినిమాలతో సక్సెస్ దక్కింది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ ఏడాది వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. నటించిన సినిమాల కంటే వివాదాల ద్వారానే కొంతమంది సెలబ్రిటీలకు గుర్తింపు దక్కడం గమనార్హం. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ద్వారా వార్తల్లో నిలిచారు.

ఆర్యన్ ఖాన్ ఈ కేసులో 20 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వల్ల షారుఖ్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసు ద్వారా వార్తల్లో నిలిచారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. రాజ్ కుంద్రా అరెస్ట్ ప్రభావం శిల్పాశెట్టిపై పడిన సంగతి తెలిసిందే. శిల్పాశెట్టిపై కూడా పలువురు ఆరోపణలు చేయడం గమనార్హం. ఒక వ్యాపారిని శిల్పాశెట్టి మోసం చేశారని వార్తలు వచ్చాయి.

మరోవైపు సుకేష్ చంద్రశేఖర్ కేసు ద్వారా జాక్వెలిన్ వార్తల్లో నిలిచారు. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ 10 కోట్ల రూపాయల విలువైన బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఆరోపణల వల్ల జాక్వెలిన్ పలు సినిమాల్లో ఆఫర్లను కోల్పోయారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు సమయంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరు కూడా జోరుగా వినిపించింది. ఈ కేసులో అనన్య పాండేకు సమన్లు జారీ అయ్యాయి.

బాలీవుడ్ లో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కంగనా రనౌత్ వార్తల్లో తరచూ నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే. పర్హాన్ అక్తర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. ఈ కేసులో కోర్టు కంగనాకు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.

స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ పనామా పేపర్స్ కేసులో తాజాగా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అమితాబ్, అభిషేక్ బచ్చన్ లను కూడా ప్రశ్నించడం గమనార్హం.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Share.