నయనతార నుండి హన్సిక వరకు ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే..!

  • February 23, 2023 / 10:49 AM IST

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఎక్కువ కాలం సాగదు.. స్టార్ హీరోలు, వారి వారసులు అయితే ఎంచక్కా వయసుతో సంబంధం లేకుండా దూసుకెళ్లిపోతుంటారు.. 60+ అయినా కుర్ర హీరోయిన్లతో స్టెప్పులెయ్యొచ్చు.. వారసులు స్టార్స్‌గా రాణిస్తున్నా కానీ వీళ్లు రొమాన్స్ చెయ్యొచ్చు.. అదే హీరోయిన్లు ఏవైనా ఆంక్షలు పెట్టినా.. కాలం, అదృష్టం కలిసి రాక సినిమాలు హిట్ అవ్వకపోయినా ఆటోమేటిగ్గా అవకాశాలు తగ్గిపోతాయి.. పైగా పెళ్లైతే మాత్రం ఇక వాళ్ల కెరీర్ ఎండ్ అయిపోయినట్టే..

ఇలా చాలా మంది హీరోయిన్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. అయితే దశాబ్ద కాలంగా సెకండ్ ఇన్నింగ్స్‌తో పాపులర్ అయిన నటీమణులు.. కథానాయికల కంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే ఎక్కువమంది అభిమానుల్ని, డబ్బుని సంపాదించుకున్న వారూ ఉన్నారు.. కట్ చేస్తే.. కొంతమంది ముద్దుగుమ్మలకు మాత్రం మూడు ముళ్లు పడ్డా.. పిల్లల తల్లులైనా కానీ క్రేజ్ తగ్గడం లేదు.. క్రేజీ ఆఫర్స్ వారి కోసం క్యూ కడుతున్నాయి.. డిమాండ్ పెరిగిపోవడంతో సదరు కథానాయికలను తమ సినిమాల్లో బుక్ చేసుకునేందుకు వారు అడిగినంత ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు మేకర్స్.. అలా పెళ్లైనా డిమాండ్ ‘తగ్గేదే లే’ అంటున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) నయనతార..

లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ని పెళ్లాడి.. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను (కవలలు) పొందింది.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన నయన్.. పెళ్లి తర్వాత కూడా కథానాయికగా దూసుకెళ్తోంది.. అమ్మడికి ఒక్కో చిత్రానికి గానూ అక్షరాలా రూ. 10 కోట్లు ఇస్తున్నారట..

2) సమంత..

నయనతార తర్వాత సెకండ్ ప్లేస్ సమంతదే.. పెళ్లి, విడాకులు, తర్వాత అనారోగ్యం కారణంగా కొంత కాలం ఇబ్బందులు ఎదుర్కొన్న సామ్.. తిరిగి వర్క్ మోడ్‌లోకి వచ్చేసింది.. సినిమాలు, వెబ్ సిరీస్‌‌లతో సందడి చెయ్యబోతోంది.. సమంత ఒక్క సినిమాకి రూ. 5 కోట్లు అందుకుంటుందట..

3) కాజల్ అగర్వాల్..

పెళ్లి తర్వాత బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. రీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది.. బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో కథానాయికగా కాజల్ దాదాపు కన్ఫమ్ అయిపోయినట్టే అంటున్నారు.. ఇందుకు గానూ తనకు రూ. 3 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారని సమాచారం..

4) హన్సిక మొత్వానీ..

సొట్ట బుగ్గల సుందరి హన్సిక మొత్వానీ ఇటీవలే వివాహం చేసుకుంది.. అయినా ఆమెకు డిమాండ్ తగ్గలేదు.. ఒక్కో సినిమాకి రూ. 2 కోట్లు ఇస్తామంటున్నారు మేకర్స్..

5) శ్రియ శరణ్..

40+ లోనూ వయ్యారాలతో ఉడుకు పుట్టిస్తోంది శ్రియ శరణ్.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయనుంది.. ఉపేంద్ర ‘కబ్జ’ మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ.. ఒక్కో మూవీకి రూ. 40 లక్షల వరకు తీసుకుంటుందట..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus