ఆగస్టు నెల లిస్ట్‌ వచ్చింది.. ఎవరెక్కడో చూసుకున్నారా!

దేశంలో పాపులర్‌ హీరోలు, హీరోయిన్లు, సినిమాల గురించి ప్రతి నెలా ఆర్‌మాక్స్‌ అనే సంస్థ వివరాలు వెల్లడిస్తూ ఉంటుంది. అలా ఆగస్టుకు సంబంధించిన వివరాలను ఆర్‌మాక్స్‌ ఇటీవల ట్వీట్‌ చేసింది. దాని ప్రకారం చూస్తే హీరోయిన్స్‌లో సమంత తొలి స్థానంలో ఉండగా, హీరోల్లో విజయ్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. మరి మిగిలిన స్థానాల్లో ఎవరెక్కడ ఉన్నారు, ఏ సినిమా స్థానమేంటి అనే వివరాలు మీకోసం.

* మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ స్టార్‌ సర్వేలో విజయ్‌ తర్వాత అంటే రెండో స్థానంలో ప్రభాస్‌, మూడో స్థానంలో ఎన్టీఆర్‌, నాలుగో స్థానంలో అల్లు అర్జున్‌, ఐదో ప్లేస్‌లో యశ్‌ ఉన్నారు. అక్షయ్‌ కుమార్‌కు ఆరో స్థానం దక్కగా, రామ్‌చరణ్ ఏడో స్థానంలో నిలిచాడు. మహేశ్‌బాబు 8లో ఉండగా, సూర్య తొమ్మిదిలో ఉన్నాడు. ఇక పదో ప్లేస్‌లో అజిత్‌ కుమార్‌ నిలిచాడు.

* మోస్ట్‌ పాపులర్‌ ఫిమేల్‌ స్టార్స్‌ టాప్‌ 10 జాబితాలో సమంత తొలి స్థానంలో నిలిచింది. అలియా భట్‌ రెండో స్థానంలోను, నయనతార మూడో ప్లేస్‌లోను, కాజల్‌ అగర్వాల్‌ నాలుగులో ఉంది. ఇక దీపికా పడుకొణెకు ఐదో స్థానం రాగా, ఆరో స్థానంలో రష్మిక మందన నిలిచింది. ఏడో ప్లేస్‌లో కీర్తి సురేశ్‌ నిలవగా, కత్రినా కైఫ్‌ ఎనిమిదితో సరిపెట్టుకుంది. ఇక ఆఖరి రెండు స్థానాల్లో వరుసగా పూజా హెగ్డే, అనుష్క శెట్టి ఉన్నారు.

* ప్రస్తుతం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్‌లో ‘పుష్ప : ది రూల్‌’ వచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రభాస్‌ ‘సలార్‌’, ‘ఆది పురుష్’ నిలిచాయి. పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’కు నాలుగో స్థానం దక్కగా, విజయ్‌ దేవరకొండ – సమంతల ‘ఖుషీ’ ఆఖరిదైన ఐదో స్థానంలో నిలిచింది.

* ప్రాంతీయ భాషలకు సంబంధించిన సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్‌ ‘మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ స్టార్‌’ జాబితాలో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ, చిరంజీవి, రవితేజ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Share.