Tovino Thomas: ఇక్కడ సినిమాలు చేయడానికి భయపడుతున్న టోవినో థామస్.. ఏమైందంటే?
- September 11, 2024 / 12:32 PM ISTByFilmy Focus
మలయాళ నటుడు, నిర్మాత టోవినో థామస్ (Tovino Thomas) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటుడు తెలుగు హీరోల సినిమాలలో నటించడానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదు. రియలిస్టిక్, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న ఈ నటుడు త్వరలో ఏ.ఆర్.ఎం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏ.ఆర్.ఎం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ నటుడు మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలో చేసే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్నకు తాను నటించనని వెల్లడించారు.
Tovino Thomas

తెలుగులో ఒక సినిమాలో నేను నటిస్తే మలయాళంలో నాలుగు సినిమాలు వదులుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. నేను తెలుగు సినిమాల కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని టోవినో థామస్ (Tovino Thomas) పేర్కొన్నారు. మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని టోవినో థామస్ అన్నారు.
తెలుగులో సినిమాలు చేస్తున్న మలయాళ నటులు ఇక్కడి సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల 12వ తేదీన ఏ.ఆర్.ఎం. మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. టోవినో థామస్ (Tovino Thomas) మెగాస్టార్ గురించి పాజిటివ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నేను చూసిన మొదటి తెలుగు సినిమా చిరంజీవిదే (Chiranjeevi) అని ఆయన తెలిపారు. టోవినో థామస్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మలయాళంలో మాత్రం టోవినో థామస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. టోవినో థామస్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
















