నాలుగు దశాబ్దాలు వయస్సు దాటినా ఇప్పటికే కుర్ర హీరోయిన్స్ తో సరిసమానంగా అవకాశాలను దక్కించుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరు త్రిష. తెలుగు మరియు తమిళం భాషల్లో ఈమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమెకి తమిళం లో మహర్దశ నడుస్తుంది కానీ, టాలీవుడ్ లో మాత్రం ఎలాంటి అవకాశాలు రావడం లేదు. రీసెంట్ గానే తమిళం లో పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న త్రిష, ఇప్పుడు సౌత్ ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ ‘లియో’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రం ఈ నెల 20 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అన్నీ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈలోపే త్రిష నటించిన మరో సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరు ‘ది రోడ్’. మలయాళం లో ఇటీవలే గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఒక జాతీయ హైవే లో తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఆ యాక్సిడెంట్ లో త్రిష అమ్మా నాన్నలు చనిపోతారు.
కానీ ఈ యాక్సిడెంట్స్ అన్ని సహజంగా జరుగుతున్నవి కాదని, కచ్చితంగా దీని వెనుక ఎదో పెద్ద మిస్టరీ దాగుంది అని త్రిష కనిపెడుతుంది. ఆ మిస్టరీ ఏమిటి అనేదే ‘ది రోడ్’ స్టోరీ. కథ ఆసక్తిగానే ఉన్నా, డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని ఆసక్తికరంగా రాసుకోవడం లో విఫలం అయ్యాడు. అందుకే నెగటివ్ రివ్యూస్ వచ్చాయి.
అయితే (Trisha) త్రిష నటించిన ప్రతీ తమిళం/ మలయాళం సినిమాలు తెలుగు లో దబ్ అయ్యేవి, కానీ ‘ది రోడ్’ చిత్రాన్ని తెలుగు దబ్ చేసి విడుదల చెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ఒక సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అని అంటున్నారు ఫ్యాన్స్.