సౌత్ సినీ ఇండస్ట్రీలో గత రెండున్నర దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ తో అగ్రనటిగా కొనసాగుతున్న త్రిష, (Trisha) ఇప్పుడు మరోసారి ట్రాక్‌లోకి వచ్చేశారు. 2003లో టాలీవుడ్‌లో ‘నీ మనసు నాకు తెలుసు’తో అరంగేట్రం చేసిన త్రిష, ఆ తరువాత స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వయసు పెరుగుతున్నా, త్రిష స్టార్ హోదా మాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా త్రిష కెరీర్‌ను మళ్లీ మలుపుతిప్పిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan).
Trisha
ఈ సినిమాలో ఆమెకు వచ్చిన క్రేజ్‌తో మరోసారి స్టార్ హీరోలతో అవకాశాలు క్యూ కట్టాయి. ‘లియో’ (LEO) సినిమాలో విజయ్‌కు (Vijay Thalapathy) జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా ఏడు పెద్ద సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) మూవీ పూర్తి చేయగా, అజిత్ హీరోగా వస్తోన్న ‘విదాముయార్చి’ సంక్రాంతి విడుదలకు సిద్ధమైంది. అలాగే మరో అజిత్ (Ajith) మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.
కమల్ హాసన్‌తో (Kamal Haasan) ‘థగ్ లైఫ్’ (Thug Life) , మలయాళంలో మోహన్ లాల్‌తో (Mohanlal) ‘రామ్’, అలాగే సూర్య (Suriya) 45లో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళంలో ‘ఐడెంటిటీ’ అనే థ్రిల్లర్ మూవీని కూడా పూర్తి చేశారు. ఇవన్నీ కాకుండా త్రిష రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు మరింత పెరిగింది. ఒక్క సినిమాకు కోటి రూపాయిల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
గతంలో తనతో కలిసి కెరీర్ మొదలుపెట్టిన చాలా మంది హీరోయిన్‌లు సైడ్ క్యారెక్టర్లకు పరిమితం కాగా, త్రిష మాత్రం స్టార్ హీరోలతో ప్రాజెక్టులలో లీడ్ రోల్ చేస్తూ స్పీడ్‌గా దూసుకుపోతున్నారు. ఈ ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, త్రిష (Trisha) హవా మరింతగా పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఆ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.