Trivikram: ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న త్రివిక్రమ్!

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు దర్శకునిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రేంజ్ ను పెంచాయి. త్రివిక్రమ్ తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ కావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా తెరపైకి వచ్చింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక విషయంలో త్రివిక్రమ్ పొరపాట్లు చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మహేష్ అభిమానులు ఈ సినిమాలో పూజా హెగ్డే ఎంపిక విషయంలో ఒకింత అసంతృప్తితో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద వరుసగా పూజా హెగ్డే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే సంగతి తెలిసిందే. ఎఫ్3 సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసినా ఆ సాంగ్ సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. గతంతో పోల్చి చూస్తే పూజా హెగ్డేకు క్రేజ్ తగ్గింది. మరోవైపు ఈ సినిమాలో నందమూరి తారకరత్న ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది.

అయితే నటుడిగా తారకరత్నకు మంచి పేరు ఉన్నా ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ లేదు. తారకరత్న నటించిన సినిమాలలో కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువనే సంగతి తెలిసిందే. సినిమాలో నటీనటుల ఎంపిక సినిమాపై క్రేజ్ పెంచేలా ఉండాలే తప్ప తగ్గించే విధంగా ఉండకూడదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత సినిమాలతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని మహేష్ బాబుకు త్రివిక్రమ్ కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus