దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ సమయమే తీసుకుంటారు. త్వరగా సినిమా చేయడానికి ప్రయత్నిస్తానని చెబుతారు కానీ ఓవరాల్ గా మాత్రం ఎక్కువ రోజులే పడుతుంది. సినిమాకి కావాల్సిన సెట్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి నటీనటుల వరకు త్రివిక్రమ్ అసలు రాజీ పడరు. ‘అల వైకుంఠపురములో’ సినిమా సమయంలో కాకినాడ పోర్ట్ దగ్గరకు రోల్స్ రాయిస్ కావాల్సిందేనని పట్టుబట్టారు. మరో కారుతో రాజీ పడరు. సినిమాలో పనిమనిషి క్యారెక్టర్ కోసం కూడా ఆయన ఎవరిని అడిగితే వారిని తీసుకోవాల్సిందే.
కానీ తొలిసారి త్రివిక్రమ్ రాజీ పడి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారట. త్రివిక్రమ్ సినిమాకి స్టార్ కాస్ట్ అనేది పెద్ద సమస్య. ఇతర భాషల్లో ఫేమస్ నటీనటులను తీసుకోవడం అతడికి అలవాటు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా, ఆర్టిస్ట్ లతో నిడిపోయేలా చూస్తుంటారు. అలా చేయడం వలన సినిమా క్వాలిటీ సంగతి పక్కన పెడితే షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయడం అనేది సమస్య అవుతుంది. అందరి డేట్స్ సమీకరించడం అంత ఈజీ టాస్క్ కాదు.
పైగా ఇటీవల నటులంతా ఫుల్ బిజీగా ఉంటున్నారు. అందుకే త్రివిక్రమ్ ఈసారి ముందుగా షెడ్యూల్స్ వేసి, షూటింగ్ డేట్స్ డిసైడ్ చేసుకొని.. ఆ తరువాత ఆ తేదీలకు ఎవరు అందుబాటులో ఉంటే వారినే తీసుకోవాలని భావిస్తున్నారు. మహేష్ బాబు, పూజాహెగ్డే, శ్రీలీల ఇలా మెయిన్ క్యారెక్టర్స్ వరకు ఓకే కానీ మిగిలిన నటీనటుల విషయంలో రాజీ పడబోతున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఎవరూ వదులుకోరు.
అలానే ఫారెన్ షూటింగ్ అనేది పెట్టుకోకుండా వీలైనంత వరకు ఇక్కడే షూటింగ్ జరిపించాలని అనుకుంటున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కు లేదంటే ఆగస్టుకి సినిమాను రిలీజ్ చేయాలనేది మహేష్-త్రివిక్రమ్ ల ఆలోచన.