Trivikram oneday Remuneration: వామ్మో.. త్రివిక్రమ్ డిమాండ్ మామూలుగా లేదుగా!

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా రెండున్నరేళ్ల క్రితం విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ తర్వాత సినిమా మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఆగష్టు నుంచి మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ మొదలవుతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా షూటింగ్ ల బంద్ నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుందో లేదో చూడాల్సి ఉంది. అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీకి సంబంధించిన యాడ్ ను షూట్ చేశారు.

ఈ యాడ్ కోసం త్రివిక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఏకంగా 40 నుంచి 45 లక్షల రూపాయలు కావడం గమనార్హం. కంపెనీ ఇచ్చిన ప్రకటనను యాజ్ ఇట్ ఈజ్ గా తెరకెక్కించడానికే త్రివిక్రమ్ కు ఈ స్థాయిలో పారితోషికం దక్కుతోందని సమాచారం అందుతోంది. వరుసగా ప్రముఖ కంపెనీల యాడ్లలో నటించడం ద్వారా బన్నీ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.

అందువల్ల ఒక్కపూటకు 45 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో తెరకెక్కించే సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ అతడు హిట్టైనా ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.

మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మరో సినిమా ఖలేజా కమర్షియల్ గా ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. అయితే మహేష్ కు త్రివిక్రమ్ ఈసారి కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికయ్యారనే సంగతి తెలిసిందే.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus