రాజమౌళి సినిమా వస్తే పోస్టర్లు ఆ సినిమాకు కాపీ, ఈ సినిమాకు కాపీ అని అంటుంటారు. దేవిశ్రీప్రసాద్, తమన్ సంగీతం రిలీజ్ అయితే ఆ సినిమాలోంచి ఎత్తేశారు, ఈ పాట నుంచి తీసుకున్నారు అని అంటుంటారు. అదే త్రివిక్రమ్ సినిమా వస్తోంది అంటే ‘లార్గో వించ్’ లాంటి కథేనా అని అంటుంటారు. అంతగా ‘లార్గో వించ్’ కథకు ఆయన సినిమాలకు సంబంధం ఉంటూ వస్తోంది. ఆయన నుండి ఇటీవల వచ్చిన సినిమాల్లో ‘లార్గోవించ్’ రిఫరెన్స్ చాలా దగ్గర్ల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి కథే సిద్ధం చేస్తున్నారట గురూజీ.
ఎన్టీఆర్‌తో సినిమా రద్దు అయ్యాక త్రివిక్రమ్ మహేష్‌తో సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా సినిమా అయితే పక్కగా ఉంటుందని వార్తలొస్తున్నాయి. దీంతో సినిమా కథ ఎలా ఉండొచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే ఈ సినిమా కథ ఇలా ఉండొచ్చు అంటూ కొన్ని లీకలు వచ్చాయి. వాటి ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ‘అత్తారింటికి దారేది’ స్టయిల్‌లో ఉంటుందని అంటున్నారు. అయితే మహేష్ ఇమేజ్‌కి తగ్గట్టు, త్రివిక్రమ్ స్టయిల్‌లో తీస్తారని టాక్.
త్రివిక్రమ్ ఏ సినిమా చేసినా ‘లార్గో వించ్ ’ అనే ఫ్రెంచ్ సినిమా పోలికలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అయితే మొత్తంగా అలానే ఉంటుంది. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ‘లార్గో వించ్’ పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయని చెబుతున్నారు. అయితే దానికి తనదైన శైలిల ఫ్యామిలీ డ్రామాను జోడించి త్రివిక్రమ్ కథను రాసుకుంటున్నాడట. హీరో.. ఓ కుటుంబంలో చేరి ఆ కుటుంబం సమస్యల్ని పరిష్కరించడమే సినిమా. ‘అతడు’ పాయింట్‌లా ఉంది కదా. గురూజీ సినిమా పాయింట్లు అలానే ఉంటాయి లెండి.