తెలంగాణ రాష్ట్రంలోని ప్రఖ్యాత గాంచిన ప్రాంతాల్లో వరంగల్ జిల్లా ఒకటి. ఇక్కడ అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తన సినిమాలో చూపించాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాయల సీమ నేపథ్యంలో సాగే “అరవింద సమేత వీర రాఘవ” సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో ఎన్టీఆర్ క్యారక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయంట. రాయలసీమలో వీర రాఘవరెడ్డిగా, సిటీలో సిద్ధార్థ్ గౌతమ్‌గా రెండు కోణాలున్న పాత్రలో తారక్ కనిపిస్తారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.
సీమలో పూజా హెగ్డే తో రొమాన్స్ చేయనుండగా.. సిటీలో ఈషా రెబ్బతో చెట్టాపట్టాలేసుకొని తిరగనున్నారు. ఈషా రెబ్బా, ఎన్టీఆర్ నటించే సన్నివేశాలను పొల్లాచిలో తీద్దామనుకున్నారు. అయితే వరంగల్ ల్లో మంచి ప్రదేశాలు ఉన్నాయని చెప్పడంతో ఇక్కడే ఆ సీన్స్ కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అందుకోసం నిన్న వరంగల్ కి చేరుకున్న త్రివిక్రమ్ మొదట భద్రకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం లొకేషన్ వేట మొదలెట్టారు. కథకి అనువైన లొకేషన్ దొరకగానే షూటింగ్ ప్రారంభిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది.