Manchu Manoj: ఓటీటీలోకి వచ్చాక ఆ డైలాగ్ ట్రోల్ మెటీరియల్ అయిపోద్దా!
- June 2, 2025 / 12:23 PM ISTByPhani Kumar
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) , మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohith) .. లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘భైరవం'(Bhairavam). విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ (K. K. Radhamohan) నిర్మించారు. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఈ సినిమాకి బజ్ ఏర్పడింది. పైగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గరుడన్’ కి రీమేక్ కావడంతో మొదటి నుండీ పాజిటివ్ బజ్ తో ముందుకు సాగింది.
Manchu Manoj

మొత్తానికి మే 30 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మనోజ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. 7 యేళ్ళు గ్యాప్ రావడం వల్ల అనుకుంట చాలా హుషారుగా ఈ సినిమాని ప్రమోట్ చేశాడు మనోజ్. అతని కోసం అయినా ఈ సినిమా చూడాలి అనే ఫీలింగ్ కూడా తెప్పించాడు. సినిమాలో కూడా అతని పాత్ర బాగానే ఉంది. ఒక రకంగా విలన్ టైప్ రోల్.

కొన్ని సీన్స్ లో అయితే మోహన్ బాబుని కూడా తలపించాడు. కాకపోతే ఒక్కటే మేజర్ కంప్లయింట్. చాలా సీన్స్ లో మనోజ్ వాయిస్ కొంచెం అతిగా అనిపిస్తుంది. అవసరం లేని సన్నివేశాల్లో కూడా అతని బేస్ వాయిస్ తో ఇబ్బంది పెట్టాడు. పైగా ఒక సీన్ లో ‘ వీడేమిటి ప్రతిసారీ బేస్ వాయిస్ తో మింగేస్తున్నాడు ‘ అనే డైలాగ్ కూడా ఉంది. సినిమా ఓటీటీలోకి వచ్చాక ఆ డైలాగ్ తో మనోజ్ ను ట్రోల్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు











