Oscar 2023: ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఆస్కార్ అవార్డు అందుకున్న మరో ఇండియన్ సినిమా

అవును ఈరోజు ఇండియన్ సినిమా దేశం మీసం మెలేసింది. లాస్ ఏంజిల్స్ (కాలి ఫోర్నియా , అమెరికా) లోని డాల్బీ ధియేటర్ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డల ప్రధానోత్సవ వేడుకల్లో ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి . బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో.. ఆర్.ఆర్ ఆర్ చిత్రం నుండీ నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు లభించింది. 90 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఆస్కార్ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు సినిమా ఆర్.ఆర్.ఆర్ కావడం విశేషం.

నాటు నాటు పాటకి అద్భుతమైన ట్యూన్ ను సమకూర్చిన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి , లిరిక్స్ అందించిన చంద్రబోస్ ఈ అవార్డుని అందుకోవడం జరిగింది.ఎంతో హుషారెత్తించే.. విధంగా ఈ పాటను పాడింది రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ అన్న సంగతి తెలిసిందే. ఈ పాటని ఇంత అద్భుతంగా కొరియోగ్రఫీ చేసింది ప్రేమ్ రక్షిత్. ఇక ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్న మరో లఘు చిత్రం ది ఎలిఫెండ్ విస్పరర్స్ … !

ఇది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ది ఎలిఫెండ్ విస్పరర్స్.. ఈ అవార్డుని అందుకోవడం విశేషం. కార్తికి గోన్ సాల్వెస్ ఈ షార్ట్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేశారు. తప్పిపోయిన ఓ ఏనుగుని దగ్గరకు తీసుకున్న గిరిజన దంపతులు.. ఆ ఏనుగుని ఏ విధంగా పోషించారు.. ఈ క్రమంలో ఆ ఏనుగుతో వీరికి ఏర్పడిన బంధం ఏమిటి? అనే థీమ్ తో ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందింది. ఇందులో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది.

అందుకే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు లభించినట్టు స్పష్టమవుతుంది.దర్శకుడు కార్తికి గోన్ సాల్వెస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈరోజు ఇండియన్ సినీ ప్రేక్షకులు పండగ చేసుకోవాల్సిన రోజుగా అందరూ భావిస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus