బుల్లితెర రియలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీ నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగ్తా ప్రస్తుతం కంటెస్టెంట్లు క్వారంటైన్ లో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఎంపిక చేసిన కంటెస్టెంట్లతో ఇద్దరు కంటెస్టెంట్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 4 సమయంలో కూడా కంటెస్టెంట్ల గురించి ఈ తరహా వార్తలు వచ్చాయి.
బోర్ డమ్ కు గుడ్ బై అంటూ ప్రోమోలతో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5పై నాగార్జున అంచనాలను పెంచారు. ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లను ఈ సీజన్ కు ఎక్కువగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ షో సీజన్ 5 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఐటీసీకి చెందిన ప్రముఖ హోటల్ లో కంటెస్టెంట్లు క్వారంటైన్ లో ఉన్నారని సమాచారం. ఎక్కువమంది కంటెస్టెంట్లను ఎంపిక చేయడంతో కంటెస్టెంట్లలో ఎవరికైనా కరోనా వచ్చినా షోకు సమస్య రాదని సమాచారం.
మరోవైపు ఈ షో ఏ రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ సాధిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 5కు ఎవరు మీలో కోటీశ్వరులు షో నుంచి పోటీ ఎదురవుతుండటంతో రెండు షోల టీఆర్పీ రేటింగ్ లను పోల్చి చూసే అవకాశం ఉంది. అయితే నాగార్జున ఈ సీజన్ కు మాత్రమే హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ వరకు బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం కానుంది.