ఉదయ్ కిరణ్..2000 వ సంవత్సరంలో ‘చిత్రం’ తో కెరీర్ ప్రారంభించి.. 2001 లో ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో స్టార్ హీరో అయ్యాడు. అతని దూకుడు ముందు స్టార్ హీరోల సినిమాలు కూడా నిలబడేవి కావు. చిరంజీవి ‘డాడి’, వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలకంటే కూడా ‘మనసంతా నువ్వే’ చిత్రం ఎక్కువ కలెక్ట్ చేసింది అని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ఉదయ్ కిరణ్ చాలా హార్డ్ వర్కర్ కూడా అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతూ ఉంటారు.
ఒకే రోజు అతను 3 సినిమాలకు గాను 18 గంటల వరకు పనిచేసేవాడని ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు చెబుతుండేవారు. మెగాస్టార్ చిరంజీవి అతన్ని కుటుంబసభ్యున్ని చేసుకోవాలని భావించారు అంటే అతని ఎదుగుదలను అందరూ అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ముచ్చట ఎక్కువ కాలం మిగల్లేదు. కొన్ని కారణాల వల్ల అతను చిరంజీవి కుటుంబ సభ్యుడు కాలేకపోయాడు. తర్వాత అతని కెరీర్ ఊహించని విధంగా డౌన్ అయ్యింది.
అది ఎందుకు అనేది తనకు కూడా కచ్చితంగా తెలీదన్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు,ఉదయ్ కిరణ్ కు అత్యంత సన్నిహితుడు అయిన మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు అతని నిర్మాణంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ‘అతడు’ ని మొదట ఉదయ్ కిరణ్ తో చేయాలనుకున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆ టైం లో ఉదయ్ కిరణ్ డేట్స్ ఖాళీ లేవని.. ‘ఒక ఏడాది ఆగితే చేస్తాను సర్’ అని చెప్పాడని మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు మురళీ మోహన్. అదే టైంలో మహేష్ బాబుని అప్రోచ్ అవ్వడం..
అతను చేస్తాను అని చెప్పడంతో ‘అతడు’ మహేష్ బాబు చేశాం.. అంటూ మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు. అయితే ఓ సందర్భంలో ‘అతడు’ ని పవన్ కళ్యాణ్ తో చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ఆ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా మహేష్ కెరీర్లో ఆ మూవీ బ్లాక్ బస్టర్ కాలేదు కానీ ఓ డీసెంట్ హిట్ గా నిలిచింది.