కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra Rao) ‘UI ది మూవీ’ (UI The Movie) తో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతనే డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘లహరి ఫిల్మ్స్’, ‘జి మనోహరన్’ (Manoharan) & ‘వీనస్ ఎంటర్‌టైనర్స్’ కెపి శ్రీకాంత్ (Sreekanth K.P.) ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజు యావరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది.
క్రిస్మస్ హాలిడేని కూడా క్యాష్ చేసుకోవడంతో టార్గెట్ కి చాలా వరకు దగ్గరగా వెళ్ళింది.అయితే 7వ రోజు డౌన్ అయ్యింది. ఒకసారి (UI) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
‘UI’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి. మొదటి వారం ఈ సినిమా రూ.1.26 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన సినిమా బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి.