ప్రభాస్ కు అస్సలు కలిసిరాని నెలగా మార్చ్ ను చెప్పుకోవాలి. ఆయన హీరోగా నటించిన రెండో చిత్రం మార్చ్ నెలలో రిలీజ్ అయ్యింది. డివైడ్ టాక్ తో రన్ అయిన ఈ చిత్రం జర్నీ ప్లాప్ రిజల్ట్ తో ముగిసింది. ఇక కృష్ణవంశీతో ప్రభాస్ చేసిన ‘చక్రం’ కూడా ఇదే నెలలో రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా ముగిసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘రాధే శ్యామ్’ రిజల్ట్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరే ఈరోజు ‘చక్రం’ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుతో 17ఏళ్ళు పూర్తికావస్తోంది.
కాబట్టి ఈ మూవీ గురించి మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. తెలుగు సినిమాల్లో హీరో చనిపోవడం వంటివి చూపిస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు అని ఎప్పటినుండో ఉన్న సెంటిమెంట్. ‘చక్రం’ విషయంలో అది మరోసారి నిరూపించబడింది. ఇలాంటి కథ ప్రభాస్ సెలెక్ట్ చేసుకోగానే… ఇండస్ట్రీలో చాలా మంది ప్రభాస్ ను.. ‘ఇలాంటి సినిమా నీ పెర్సనాలిటీకి సెట్ అవ్వదు’ అని హెచ్చరించారు. ఈ లిస్ట్ లో ముందుగా చిరంజీవి ఉన్నారు.
అటు తర్వాత గోపీచంద్ కూడా మరీ ఇంతలా ప్రయోగాలు అవసరం లేదు.. వెనక్కి తగ్గమని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పకనే చెప్పాడు. వీళ్ళు మాత్రమే కాదు తరుణ్, మహేష్ బాబు వంటి హీరోలు కూడా ఇలాంటి ప్రయోగాలు వద్దు అని చెప్పారట. కానీ ప్రభాస్ కు మొహమాటం ఎక్కువ. కృష్ణవంశీకి మాటిచ్చేసాడు. కాబట్టి.. వెనకడుగు వేయకుండా ‘చక్రం’ ఫినిష్ చేసాడు. 2005 వ సంవత్సరం మార్చ్ 25న ఈ చిత్రం విడుదలై మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.
నిర్మాతకి అలాగే బయ్యర్లకీ ఈ మూవీ నష్టాల్నే మిగిల్చింది. అయితే ఈ మూవీని టీవీల్లో, యూట్యూబ్ లో చూసి బాగుంది, క్లాసిక్ అనేవారు కూడా ఉన్నారు. అలాగే చక్రి సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సిరివెన్నెల గారు రాసిన ‘జగమంత కుటుంబం’ పాట ఓ క్లాసిక్ అని చెప్పాలి.