విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ సీనియర్ స్టార్ దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన సినిమా ‘నాగవల్లి’. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ కి సీక్వెల్ గా.. 2010లో కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా రూపొందిన ‘ఆప్త రక్షక’ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ రూపొందింది.’శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2010 వ సంవత్సరం డిసెంబర్ 16 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
‘చంద్రముఖి’ సినిమా రేంజ్లో ఈ మూవీ లేదని..! ‘చంద్రముఖి’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్..తో రీమేక్ చేసినట్టు ఉంది అని అంతా విమర్శించారు. అదీ కాక క్లైమాక్స్ లో వెంకటేష్ అఘోర గెటప్ కూడా ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెట్టింది.ఆ గెటప్ లో వెంకీ చేసిన డాన్స్ ఎవర్ గ్రీన్ ట్రోల్ మెటీరియల్ అనిపించుకుంది. ఇక అనుష్క పాత్ర అయితే ఆమె అభిమానులను ఫ్రస్ట్రేషన్ కి గురయ్యేలా చేసింది అనే చెప్పాలి.
మొత్తానికి ‘నాగవల్లి’ సినిమాకి ప్లాప్ టాకే వచ్చింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూశారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ‘నాగవల్లి’ కి క్యూలు కట్టారు. దీనికి మెయిన్ రీజన్ ‘చంద్రముఖి’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం.. దానికి ఉన్న ఫ్యాన్స్ అనుకోవాలి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ సినిమాలకి కూడా మంచి క్రేజ్ ఉంది.
అందుకే ‘నాగవల్లి’ (Nagavalli) బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించింది అని చెప్పాలి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో ‘నాగవల్లి’ వార్తల్లో నిలిచింది. విచిత్రం ఏంటంటే ఇదే ఏడాది.. ‘చంద్రముఖి 2 ‘ పేరుతో లారెన్స్ హీరోగా చేసిన మూవీ వచ్చింది. అది పెద్ద ‘చంద్రముఖి’ స్పూఫ్ గా మిగిలింది. ఆ సినిమా చూశాక చాలా మంది ‘నాగవల్లి’ నే బెటర్ అంటూ కామెంట్లు చేశారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!