‘దృశ్యం2’ సుజాత బ్యాక్ గ్రౌండ్ గురించి మనకి తెలియని ఆసక్తికర విషయాలు..!

కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు చూస్తే.. అవి వారి కోసమే పుట్టాయా అనిపిస్తుంది. వారు కాకుండా మరొకరు చేసుంటే పాత్ర పండేది కాదని సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు అనుకుంటూ వుంటారు. అంతేకాదు రెండు మూడు రోజుల పాటు ఆ దృశ్యాలే కళ్లముందు కనిపిస్తాయి. క్యారెక్టర్ రాసిన దర్శక రచయితల కంటే దానిని అద్భుతంగా నటించిన వారికే ఎక్కువగా క్రెడిట్ దక్కుతుంటుంది. అచ్చంట అదే కేటగిరీలోకి వస్తారు సినీ నటి సుజా వరుణి. విక్టరీ వెంకటేశ్ – మీనా కాంబినేషన్‌లో ‘దృశ్యం’కి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం2’ లో సుజా పోషించిన పాత్ర కూడా అలాంటిదే.

భర్త చేతిలో వేధింపులకు గురయ్యే పాత్రలో అద్భుతంగా జీవించిన ఆమె ఒక అండర్ కవర్ పోలీస్ అన్న విషయం చెప్పి ప్రేక్షకులకి ఇచ్చే ట్విస్ట్ మామూలుగా వుండదు. ‘దృశ్యంలో2’ లో వెంకీ, మీనా క్యారెక్టర్లతో సమానంగా సుజా పోషించిన సరిత క్యారెక్టర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో నెటిజన్లు ఎప్పటిలాగే.. ఈమె ఎవరు..? ఎక్కడ పుట్టింది..? అసలు బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ అన్న విషయాలను ఆరా తీస్తున్నారు.సుజా వరుణి అసలు పేరు సుజాత. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ మనవడు శివాజీ దేవ్‌‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె కంటే భర్త ఐదేళ్లు చిన్న..

అయినా ప్రేమకు వయసుతో అడ్డులేదని నిరూపించింది ఈ జంట. 2002లో సుజా నటిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ప్లస్ 2’ అనే సినిమాలో నటించిన ఆమె.. తెలుగులోనూ ‘అలీబాబా ఒక్కడే దొంగ’, ‘గుండెల్లో గోదారి’, ‘దూసుకెళ్తా’, ‘నాగ వల్లి’ వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. అయితే తమిళ బిగ్‌‌బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ రావడం ఆమె దశను మార్చేసింది. ఈ షోతో వచ్చిన పాపులారిటీతో సుజాకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం దృశ్యం2లో సరిత పాత్రతో నటిగా తనను తాను నిరూపించుకున్న సుజా త్వరలో బిజీ ఆర్టిస్ట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు.

Click Here For Drushyam Movie Review

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.